ఏపీలో అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి లైన్‌క్లియర్ అయింది.మెరిట్ లిస్టులో పేర్లు ఉన్నప్పటికీ ప్రక్రియను నిలిపివేశారని అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
అదేవిధంగా తమకు అన్యాయం జరిగిందని మరికొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో వాదనలు విన్న కోర్టు పాత ప్రక్రియనే కొనసాగించాలని తీర్పును వెలువరించింది.
దీంతో అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఆటంకాలు తొలగడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







