మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారుల తీరుపై చేసిన విమర్శలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు.ఏ అధికారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎవరినీ కొట్టరని చెప్పారు.
చట్టాన్ని అందరూ గౌరవించాలన్న ఆయన బాధ్యతగల మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు.ఐటీ అధికారులకు వచ్చిన కంప్లైంట్ ప్రకారమే దాడులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
ఐటీ సోదాల్లో కక్ష సాధింపు ఉండదన్నారు.ఏ తప్పు చేయనప్పుడు సెల్ ఫోన్లను తీసుకెళ్లి డస్ట్ బిన్ లో దాయడం ఎందుకని ప్రశ్నించారు.
మీరు చేసేది అంతా వైట్ బిజినెస్ అయితే భయం ఎందుకని రఘునందర్ రావు నిలదీశారు.