మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఫైర్

మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారుల తీరుపై చేసిన విమర్శలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు.

ఏ అధికారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎవరినీ కొట్టరని చెప్పారు.చట్టాన్ని అందరూ గౌరవించాలన్న ఆయన బాధ్యతగల మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు.

ఐటీ అధికారులకు వచ్చిన కంప్లైంట్ ప్రకారమే దాడులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.ఐటీ సోదాల్లో కక్ష సాధింపు ఉండదన్నారు.

ఏ తప్పు చేయనప్పుడు సెల్ ఫోన్లను తీసుకెళ్లి డస్ట్ బిన్ లో దాయడం ఎందుకని ప్రశ్నించారు.

మీరు చేసేది అంతా వైట్ బిజినెస్ అయితే భయం ఎందుకని రఘునందర్ రావు నిలదీశారు.

ఫోటో వైర‌ల్‌: ఇదేందయ్యా ఇది.. ఫ్యామిలీ మొత్తానికి క‌టౌట్‌ పెట్టేసారుగా