సూర్యాపేట జిల్లా:చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ తో విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు పెంపొందించబడతాయని కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ అన్నారు.మంగళవారం కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక కోదాడ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు పెంపొందించడంలో జెవివి కృషిని అభినందించారు.కోదాడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల విభాగంలో ప్రథమ స్థానం కట్టా సాయి భవాని మెమోరియల్ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ద్వితీయ బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నల్లబండగూడెం,గుడిబండ,తెలుగు మీడియంలో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ప్రథమ స్థానం జడ్.పి.హెచ్.ఎస్ తొగర్రాయి,ద్వితీయ స్థానం బాలుర ఉన్నత పాఠశాల కోదాడ కైవసం చేసుకున్నాయి.ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాలల విభాగంలో ప్రథమ స్థానం జయ స్కూల్ కోదాడ,ద్వితీయ స్థానం శ్రీ స్కూల్ కోదాడలు పొందాయి.
అనంతగిరి మండలం నుండి ఆంగ్ల మాధ్యమంలో ప్రథమ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శాంతినగర్, ద్వితీయ స్థానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గొండ్రియాల,తెలుగు మీడియం విభాగంలో ప్రథమ స్థానం జడ్పీహెచ్ఎస్ పాలవరం,ద్వితీయ స్థానం జడ్పీహెచ్ఎస్ త్రిపురారంలు కైవసం చేసుకున్నాయి.ప్రధమ,ద్వితీయ స్థానాల్లో నిలిచిన పాఠశాలల విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక కోదాడ డివిజన్ బాధ్యులు డిఎన్ స్వామి, ఆర్.రామనరసయ్య,ప్రధానోపాధ్యాయులు ఈ.శ్రీనివాసరెడ్డి, డి.వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు పి.శ్రీనివాస్ రెడ్డి,నర్సిరెడ్డి, సునీల్,విజయ్ కుమార్,నవ్య,నరసింహారావు,వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.