మా నాన్న గారి వ్యాఖ్యల తో నేను ఏకీభవించడంలేదు,ఆ విషయాలను నేను ఖండిస్తున్నాను ఈ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ని ఎంతమంది పొగిడారు?యూనివర్సిటీ పేరు మారిస్తే విమర్శించే హక్కు ఎవరిచ్చారు? నా వ్యక్తిగత అభిప్రాయం ఏదైనా రాజధాని విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయమే నాకు శిరోధార్యం ఎప్పుడు ఎక్కడ ఏ సామాజిక వర్గానికి ప్రాదాన్యత కల్పించాలనేది ముఖ్యమంత్రి నిర్ణయం మారిన కాలమాన పరిస్థితుల్లో మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ప్రవర్తించాలి పాత కాలంలో అంబాసిడర్ బావుందని,ఇప్పుడు కూడా అదే బావుంటుందని అనలేము వాగే నోరు,తిరిగే కాలు ఆగదన్నట్లుగా మా నాన్నగారిని ఆపలేము.
మా చిన్న తనంలో మా నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు చెడ్డ పేరు తేకూడదనే విధంగా ప్రవర్తించేవాళ్ళము మా నాన్నగారి నోరు చాలా ప్రమాదకరం ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇరకాటంలో పెట్టడం ఆయన నైజం ఈ విషయాన్ని ఏ ఒక్క వైయస్సార్ అభిమాని పట్టించుకోవద్దని మనవి 175మంది తో అసెంబ్లీ లో కూర్చునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి తోనే నా ప్రయాణం పార్టీ లో ఏమ్మా అంటే నీ అమ్మ అనే విధంగా వక్రీకరిస్తున్నారు కొందరు కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా పార్టీలో గందరగోళ వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు
మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ని ఓడించాలనే నా ఆకాంక్ష ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వలనే నెరవేరింది 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పోటీ చేయమంటే చేస్తా,లేకుంటే పార్టీ కోసం పనిచేస్తా నేను పనీ పాటా లేని వాడిని కాదు నా కుమారుడి అభిప్రాయం కూడా తీసుకున్నాను,తన జీవిత కాలం వైసీపీ తోనే కొనసాగుతాడు రాజకీయాల్లో అత్యాశ,దురాశ ఎక్కువైపోయింది,నా చేతులతో టిక్కెట్లు ఇప్పించి,అవకాశం ఇప్పించిన వారు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
నాకు అవకాశమిచ్చి గెలిపించిన నా నాయకుడు జగన్మోహన్రెడ్డి ని కానీ, నియోజకవర్గ ప్రజలను కానీ నేను విమర్శించనుమైలవరం నియోజకవర్గం లో గందరగోళానికి కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయి.వారు ఎవరు, ఏంటని అధిష్టానం దృష్టిలో రాబోయే రెండు మూడు రోజుల్లోనే ఉంచుతాను నేను అన్న మాటల్ని నా భావనతో కాకుండా వక్రీకరించి స్వంత పార్టీ వారే దుష్ప్రచారం చేస్తున్నారు
వైసీపీ శ్రేణులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దుజోగి రమేష్,నాకు విభేదాల విషయంలో అధిష్టానంతో చర్చించిన తర్వాతే మీడియాతో మాట్లాడుతాను నేను ప్రెస్ మీట్ పెడుతున్నా అని తెలియగానే కొందరితో ప్రెస్ మీట్ పెట్టించి నన్ను విమర్శించారు ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు గ్రామ సచివాలయ నిర్మాణ మార్పు విషయంలో మార్చిన చోట కూడా అదే శిలా ఫలకాన్ని ఏర్పాటు చేస్తాము అనారోగ్యమే తప్ప నియోజకవర్గానికి దూరంగా లేను ఇంటిలో లు కూడా త్వరలోనే సర్దుకుంటుందని అనుకుంటున్నాను ఇక్కడ అభ్యర్థిని మార్చ దలిస్తే ఆ అభ్యర్థికి కూడా మద్దతుగా నేను నియోజకవర్గం లో తిరుగుతానుపార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం
.