Mutyala subbaiah chiranjeevi : మా హీరో సినిమా బాగా తీయాలి లేదంటే ఛస్తావ్ అంటూ ముత్యాల సుబ్బయ్యకు బెదిరింపు ఉత్తరాలు

ఎంతో అభిరుచి ఉన్న ఎడిటర్ మోహన్, ప్రొడ్యూసర్ గా మారి కేవలం 9 సినిమాలు మాత్రమే తీశారు.అందులో అన్ని విజయం సాధించడం అంటే మాటలు కాదు.1991 మామగారు వంటి ఎమోషనల్ కంటెంట్ తో ఉన్న సినిమాను ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కించిన మోహన్ సరిగ్గా ఆరేళ్లకు చిరంజీవి హిట్ ఇచ్చే పని పెట్టుకున్నారు.అదే హిట్లర్ సినిమా.

 Who Sent Letters To Mutyala Subbaiah , Mutyala Subbaiah, Chiranjeevi , Hitler ,-TeluguStop.com

ఈ సినిమా కు కూడా ముత్యాల సుబ్బయ్య అయితేనే ఘనవిజయం సాధిస్తుంది అని మోహన్ బలంగా నమ్మారు.దాంతో రంగంలోకి దిగి అటు చిరంజీవిని ఇటు సుబ్బయ్య ను లైన్ లో పెట్టి సినిమాను తీయాలని పూనుకున్నారు.

అయితే సినిమా తీయడం ముత్యాల సుబ్బయ్యకు పెద్ద విషయం ఏమి కాదు కానీ మెగా స్టార్ చిరంజీవితో సినిమా చేయడం పెద్ద సవాల్ గా మారింది.చిరంజీవి తో సినిమా చేయడం కూడా ఆయనకు అంత పెద్ద కష్టం కాదు కానీ ఆ సమయంలో చిరంజీవి చాల ఫ్లాప్స్ తో సతమతమవుతూ ఉన్నాడు.

రిక్షావోడు, బోగ్ బాస్, ముఠా మేస్త్రి వంటి ఒక ఐదారు సినిమాలు వరసగా ఫ్లాప్స్ అవ్వడం తో హిట్లర్ లాంటి విభిన్నమైన కథను ఎంచుకొని చిరంజీవికి హిట్ ఇచ్చే బాధ్యతను భుజాలపైన వేసుకున్నాడు ముత్యాల సుబ్బయ్య.అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ముత్యాల సుబ్బయ్యను బెదిరిస్తూ కొన్ని లెటర్స్ వచ్చాయి.

Telugu Chiranjeevi, Mohan, Hitler, Ramba, Tollywood-Latest News - Telugu

చిరంజీవి సినిమాను ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహిస్తున్నదని తెలియగానే అయన అభిమానులు ముత్యాల సుబ్బయ్యను బెదిరిస్తూ లెటర్స్ రాశారట.నువ్వు చేస్తుంది మా బాస్ చేస్తున్న సినిమా.కాస్త వొళ్ళు దగ్గర పెట్టుకొని షూటింగ్ చెయ్యి.మెగాస్టార్ ని తెరపైన బాగా చూపించాలి అంటూ బెదిరిస్తూ చాలా ఉత్తరాలు రాశారట.అవి చూసి మొదట్లో ముత్యాల సుబ్బయ్య భయపడ్డ ఆ తర్వాత తాను చేయాల్సిన పని తాను చేసాడు.సినిమా విడుదల అయ్యి ఘనవిజయం సాదించి చిరంజీవి కి మళ్లి విజయాల బయటకు తలుపు తెరిచింది.

ఇలా చిరంజీవి ఫ్యాన్స్ బెదిరింపులు ఉత్తరాలు రాయడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube