యువ హీరో శర్వానంద్ రీసెంట్ గా ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మౌత్ టాక్ బాగానే వచ్చినా సినిమా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అందుకోలేదు.
ప్రస్తుతం కృష్ణ చైతన్య డైరక్షన్ లో ఒక సినిమా ఓకే చేసిన శర్వానంద్ రీసెంట్ గా సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్నారు.సీనియర్ హీరో అర్జున్ డైరక్షన్ లో విశ్వక్ చేయాల్సిన సినిమాలో కూడా శర్వానంద్ నటిస్తున్నాడని టాక్.
అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు.ఇక లేటెస్ట్ గా మరో ఫ్లాప్ డైరక్టర్ కి శర్వానంద్ ఓకే చెప్పాడని తెలుస్తుంది.
శ్రీరాం ఆదిత్య చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్ ఓకే చెప్పారని టాక్.ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన భామ కృతి శెట్టిని ఫిక్స్ చేశారట.పీపుల్స్ మీడియా ఫ్యాక్టర్ ఈ మూవీ నిర్మిస్తుంది.యువ హీరోలతో వరుస ఛాన్సులు అందుకుంటున్న కృతి శెట్టి లేటెస్ట్ గా శర్వానంద్ సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది.
రీసెంట్ గా అమ్మడి ఖాతాలో వరుసగా 3 ఫ్లాపులు పడిగా కూడా కృతికి ఆఫర్లు మాత్రం తగ్గట్లేదు.శర్వానంద్, కృతి శెట్టి ఈ జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.







