ఏంటో కొందరు హీరోయిన్ లు అందంగా ఉన్నప్పటికీ కూడా మరింత అందంగా కనిపించడానికి ఉన్న అందాన్ని పోగొట్టుకుంటారు.కెరీర్ మొదట్లో అడుగుపెట్టిన అందానికి ఇప్పటికీ చాలా తేడా ఉంటుంది.
ఎంతలా అంటే అసలు గుర్తుపట్టలేనంత.ఇప్పటికి చాలామంది హీరోయిన్లు కెరీర్ మొదట్లో వచ్చినట్లు లేరు.
అందులో సమంత, నయనతార, కాజల్ అగర్వాల్ ఇలా చాలామంది తయ్యారయ్యారు.తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలానే తయారయింది.తన రూపం చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్.గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.
ఈమె గురించి అందరికీ తెలిసిందే.
నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.
అతి చిన్న వయసులోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను అందుకుంది.కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.
తన గ్లామర్ తో మాత్రం యువతను కన్నార్పకుండా చేసింది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోలతో, వీడియోలతో హల్ చల్ చేస్తుంది.
ఇక తొలిసారిగా కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీత్.కెరటం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో బాగా దూసుకెళ్లింది.ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉండగా.ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీని దూరం పెట్టి బాలీవుడ్ వైపు దృష్టి పెట్టింది.
అక్కడే వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.
ఇక ఈ ముద్దుగుమ్మ చాలావరకు తన వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.పైగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా బాగా నెగటివ్ కామెంట్స్ ఎదురుకుంది.
ఎక్కువగా తను షేర్ చేసుకునే ఫోటో షూట్ ద్వారా బాగా ట్రోల్స్ ఎదురుకుంటుంది.ఎందుకంటే తను తీసుకునే ఫోటో షూట్ లు అలా ఉంటాయి కాబట్టి.
అయితే కెరీర్ మొదట్లో చాలా అందంగా కనిపించిన రకుల్ ఇప్పుడు మాత్రం చాలా దారుణంగా కనిపిస్తుంది.అప్పటికే సన్నగా, నాజుగ్గా ఉన్న ఈ ముద్దుగుమ్మ మరింత వర్కౌట్ చేసి సన్నబడింది.దీంతో మరింత సన్నగా మారేసరికి జనాలు తన అవతారని చూసి షాక్ అవుతున్నారు.అయితే తాజాగా తనకు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది.
అందులో ఆమెను చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.అసలు ఆ ఫేస్ చూస్తే మాత్రం ఆమె రకుల్ ఏనా అని అనుమాన పడక తప్పదు.
ఇక ఆ ఫోటో చూసిన తన ఫ్యాన్స్, నెటిజన్స్ ఏంటి రకుల్ ఇంత ఘోరంగా తయారయ్యావు అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.చూడటానికి పేషెంట్ లాగా ఉన్నావు అంటూ ఏమైనా వ్యాధి కూడా వచ్చిందా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.