జబర్దస్త్ ద్వారా పరిచయమైన పంచ్ ప్రసాద్ అనే కమెడియన్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.జబర్దస్త్ లో తన కామెడీతో అందర్నీ బాగా నవ్వించి మంచి అభిమానం సొంతం చేసుకున్నాడు ప్రసాద్.
అయితే గత కొంతకాలం నుంచి ఆయన జబర్దస్త్ లో కనిపించడం లేదు.కారణం ఏంటంటే ఆయన ఆరోగ్యం అంతగా బాగోలేదు.
ఇదివరకే ఆయన రెండు కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడన్న సంగతి తెలిసిందే.ఇక ఈ విషయాన్ని తను జబర్దస్త్ వేదికపై పలుమార్లు తెలిపాడు కూడా.అంతటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తన వృత్తికి మాత్రం గౌరవిస్తూనే ఉన్నాడు.తన కామెడీతో అందరినీ నవ్విస్తున్నాడు.
ఈయనకు రెండు కిడ్నీలు 80% పాడవటంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు.
అయితే గత కొన్ని రోజుల నుండి ఈయన సమస్య మరింత ఎక్కువయింది.
మొన్నటి వరకు సరిగ్గా నడవలేని పరిస్థితిలో కూడా ఉన్నాడు.ఇప్పటికీ అలాగే ఉన్నప్పటికి కూడా కొద్ది కొద్దిగా కవర్ అవుతున్నట్లు కనిపించాడు.
అయితే ఈయన ఈ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని ఇటీవలే జబర్దస్త్ కమెడియన్ నూకరాజు యూట్యూబ్ లో వీడియో షేర్ చేయడంతో తెలిసింది.
ఇటీవల ఆయన ఆ వీడియో పంచుకోగా అందులో ప్రసాద్ నడవలేని పరిస్థితిలో కనిపించాడు.
అయితే మరోసారి నూకరాజు వీడియో తీయగా ఆ వీడియోని తాజాగా షేర్ చేసుకున్నాడు.ఇక అందులో ప్రసాద్ ఆరోగ్యం కాస్త కుదుటపడింది అన్నట్లుగా తెలిపాడు.కానీ డాక్టర్లు మాత్రం చికిత్స అందించాలని తెలిపారు.మొన్నటి వీడియోలో ఈ వీడియోలో ప్రసాద్ పరిస్థితి గమనించినట్లయితే కాస్త కుదుట పడినట్లే కనిపించింది.
ఇక ఆయనకు రోజు సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తున్నారని.నూకరాజు తెలిపాడు.ఇక నూకరాజు ప్రసాద్ కు నేనున్నాను అంటూ ధైర్యం ఇచ్చాడు.అంతేకాకుండా ఫ్యాన్స్ ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరినందుకు థాంక్స్ కూడా చెప్పాడు నూకరాజు.ఇక ఆ వీడియోలో స్టిక్ సపోర్టుతో నడుస్తూ కనిపించాడు.తను హాస్పిటల్ కి వెళ్లిన వీడియోను కూడా చూపించాడు నూకరాజు.
ఇక ఇప్పుడు కాస్త కుదుటపడింది అంటూ.మళ్లీ పూర్తిగా కోలుకున్న తర్వాత మరో వీడియో చేస్తాను అని నూకరాజు తెలిపాడు.ప్రస్తుతం ఈ వీడియోను నూకరాజు పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసుకున్నాడు.ఇక ఈ వీడియోని చూసిన ఆయన ఫ్యాన్స్, నెటిజన్స్ త్వరగా కోలుకోవాలి అంటూ కోరుకున్నారు.
తొందర్లోనే మళ్లీ నడుస్తారు అంటూ ధైర్యం ఇచ్చారు.
ఇక మరి కొంతమంది మీకు తొందర్లోనే నయం అవుతుంది అన్నా అంటూ.మళ్లీ మీరు జబర్దస్త్ కి వచ్చి మమ్మల్ని నవ్వించాలి అంటూ కామెంట్ పెట్టారు.మొత్తానికి ప్రసాద్ ఆరోగ్యం కాస్త కుదుట పడగా ఇంకా పూర్తిగా నయం కావాలి అంటూ అందరు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ఆ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతుంది.