Western New York Snowfall : అమెరికా : అధికారుల హెచ్చరిక....అల్లాడుతున్న న్యూయార్క్ నగరం...!!!

అమెరికాలో మంచు కురవడం సహజమైన విషయమే, అమెరికన్స్ మంచు కురిసే సమయంలో చాలా సరదాగా గడుపుతారు, మంచులో ఆడుకుంటారు కూడా, అయితే ప్రస్తుతం అమెరికాను మంచు తుఫాను ముంచేస్తోంది.గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో మంచు పెరుకుపోతోంది.

 Massive Snowfall In Western New York,western New York,snowfall,first Lake Effect-TeluguStop.com

గడిచిన రెండు రోజులుగా అమెరికాకు కీలక నగరమైన న్యూయార్క్ పై మంచు ప్రభావం తీవ్రమవుతోంది.న్యూయార్క్ తో పాటు పలు ప్రాంతాలు కూడా మంచు ప్రభావానికి వణికిపోతున్నాయి.

ముఖ్యంగా పశ్చిమ న్యూయార్క్ ప్రాంతంలో ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని తెలుస్తోంది.రోడ్లపై సుమారు 6 అడుగుల మేర మంచు పేరుకుపోయి ఉంది.

దట్టంగా కురుస్తున్న మంచు కారణంగా న్యూయార్క్ లో ఇద్దరు పౌరులు మృతి చెందినట్టుగా న్యూయార్క్ ప్రభుత్వం వెల్లడించింది.కాగా రానున్న 24 గంటల్లో ఈ మంచు ప్రభావం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, ఒక వేళ వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకోవాలి న్యూయార్క్ ప్రజలను అధికారులు హెచ్చరించారు.

అలాగే ప్రధానంగా రద్దీగా ఉండే రోడ్లు అన్నీ మంచుతో నిండిపోయాయి.దాంతో ప్రధాన రహదారులపై ఎలాంటి ప్రయాణాలకు అనుమతులు లేవని ప్రకటించారు.అంతేకాదు విమాన ప్రయాణాలను కూడా రద్దు చేసింది ప్రభుత్వం.ఇదిలాఉంటే

Telugu Lake Effect, York, Rescue, Snowfall, Snowfall Storm, Western York-Telugu

మంచు ప్రభావంతో కూరుకుపోయిన వాహనాలను బయటకు తీసేందుకు స్థానిక రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.అంతేకాదు మంచు కారణంగా ఇళ్ళలో చిక్కుకు పోయిన కనీస అవసరాలకు ఇబ్బంది పడుతున్న సుమారు 280 మందికి సహాయాన్ని అందిస్తున్నారు.చాలా ప్రాంతాలలో విద్యుత్ స్తంభించి పోయింది.

నీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో ఎమర్జెన్సీని సైతం విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube