ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో కళకళలాడుతున్నాయి.ఈవెంట్‌లు, బ్రాండ్ డీల్‌లు, టీవీ షోలు, మ్యాగజైన్‌లు తమ ప్లే ఫీల్డ్‌లను కవర్ చేయడంతో ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉపయోగించుకుంటున్నాయి.ఓ నివేదిక ప్రకారం, భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్లు 2025 నాటికి సంపాదించే మొత్తం రూ.2,200 కోట్లు అని అంచనాలు ఉన్నాయి.సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ లాభదాయకమైన కెరీర్ అవుతుందా అని చాలా మంది ఆశ్చర్యపోతారు.అయితే దీనిని ఎంచుకున్న వారు సక్సెస్ అయితే లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు.కార్పొరేట్ ఉద్యోగాలకు మించి ఆదాయం వస్తోంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారతదేశంలో అడ్వర్టయిజ్‌మెంట్‌లు 20 శాతం తగ్గిపోయాయి.అవి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు దారి మళ్లాయి.పలువురు యువకులు వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.అయితే సంపాదన కావాలంటే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫాలోవర్ల సంఖ్య పెరగాలి.అంతేకాకుండా చేస్తున్న వీడియోలకు లైకులు, కామెంట్లు అధిక సంఖ్యలో రావాలి.వైవిధ్యమైన, యూజర్లు మెచ్చే కంటెంట్ ఎంచుకోవాలి.
ఇవే కాకుండా సోషల్ మీడియాలో విజయవంతమైన ఇన్‌ఫ్లూయెన్సర్లు ఏం చేస్తున్నారో గమనించాలి.అంతేకాకుండా యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి వచ్చే ఆదాయంతో పాటు చిన్న చిన్న బ్రాండ్లకు ప్రమోట్ చేస్తే చక్కటి ఆదాయం సమకూరుతుంది.
ప్రారంభంలో, మీ కంటెంట్ వల్ల వచ్చే వ్యూస్ ఆధారంగా యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు మీకు డబ్బులు చెల్లిస్తాయి.కొందరు విజయవంతం అయ్యారని యూట్యూబ్ ఛానల్ పెట్టడం, వీడియోలు చేయడం వంటి పనులతో విజయవంతం అవలేరు.
ప్రేక్షకుల అభురుచికి అనుగుణంగా వీడియోలు చేయాల్సి ఉంటుంది.ఇలా చాలా మంది యువతరం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా మారి నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు.