Taitose city : తాబేలు నగరం అని దేనినంటారో తెలుసా? అది ఎక్కడ నిర్మింపబడిందంటే?

తాబేలు నగరం ఏమిటని అనుకుంటున్నారా? మన ఈ ప్రపంచం అనేక వింతలూ విశేషాలకు నెలవు.మానవుడు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఎన్నో అద్భుతాలు చేసాడు.

 Do You Know What The Turtle City Is , Taitose City, Viral Latest, News Viral, So-TeluguStop.com

అందులో ఈ తాబేలు నగరం ఒకటి.మీరు టూరిజం ప్లేస్‌కి వెళ్లాలంటే.

ఇలాంటి నగరాన్ని ఒకసారి సందర్శించండి.ఎందుకంటే ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి.

నీటిపై తేలియాడుతూ కనబడే ఈ నగరం చూపరులను బాగా ఆకట్టుకుంటోంది.కారణం ఈ నగరం ప్లాన్ తాబేలు ఆకారంలో ఉండటమే.

దీని పేరు పాంజియాస్ (Pangeos).

ప్రపంచంలో తొలి నీటిపై తేలే నగరంగా ఇది ప్రసిద్ధి చెందినది.ఇంతకీ ఇది ఎక్కడుందో తెలుసా? ఇటలీలో వుంది.దీనిని ఇటలీకి చెందిన లగ్జరీ ప్రాజెక్టులను చేపట్టే.Lazzarini Design Studio ఈ ప్రాజెక్టును రూ.65 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించింది.ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణంలో లజ్జారినీకి మంచి గుర్తింపు ఉంది.ఈ సంస్థ ఇప్పటికే సముద్రంపై తిరిగే చాలా ఆధునిక బోట్లను తయారు చేయడం కొసమెరుపు.2033 లో తాబేలు నిర్మాణం మొదలై.8 ఏళ్లలో పూర్తవుతుందని భావిస్తోంది.

Telugu Latest, Lazzarinidesign, Pangeos, Taitose-Latest News - Telugu

కాగా దీని ద్వారా 60 వేల మంది సముద్ర నీటిపై జీవించవచ్చని సమాచారం.2000 అడుగుల వెడల్పు ఉన్న సముద్రాలపై తేలే ఈ తాబేలు నగరంలో షాపింగ్ మాల్స్, హోటల్స్, పార్కులు, ఓ మినీ ఎయిర్‌పోర్ట్, డాక్ ఇంకా అనేక ప్రత్యేకతలు ఉంటాయి.అయితే ఈ తాబేలు నగరం ఒకచోట ఆగకుండా.సముద్రాలపై తిరుగుతూనే ఉంటుంది.దీని వేగం గంటకు 9 కిలోమీటర్లు వరకు ఉంటుందని అంచనా.ఈ ప్రాజెక్టులో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈ కంపెనీ ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా.వర్చువల్ NFT ఎంట్రన్స్ టికెట్స్‌ని రూ.1300కీ, వీఐపీ సూట్లను ఒక్కొక్కటీ రూ.13,500కి అమ్ముతోంది.చూడండి మరి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube