తెలుగులో ప్రసారమవ్వుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది.అయితే ఇప్పటికే పదివారాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 11వ వారం ముగింపు దశకు చేరుకుంది.
ఇకపోతే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ మంచి 11 మంది ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.హౌస్ లోకి కేవలం 10 మంది మాత్రమే వెళ్లారు.
ఇది ఇలా ఉంటే గతవారం అనగా పదవ వరం ఎలిమినేషన్స్ లో భాగంగా డబుల్ ఎలిమినేషన్ జరిగిన విషయం తెలిసిందే.వాసంతి అలాగే బాలాదిత్యా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు.
అయితే ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ జరగబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే 11 వ వారం నామినేషన్స్ లో భాగంగా 8 మంది నామినేట్ అయ్యారు.
ఇనయా సుల్తానా, రోహిత్, కీర్తి భట్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రాజ శేఖర్, శ్రీహాన్, మెరీనా, రేవంత్ నామినేషన్లలో ఉన్నారు.అయితే ఇమ్యునిటీ కారణంగా రాజ్ కూడా నామినేషన్ నుంచి ఎస్కేప్ అయ్యారు.
మొత్తంగా 8 మంది నామినేషన్లలో ఉన్నారు.ఇకపోతే ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో ముగ్గురు కంటెస్టెంట్లు తక్కువ ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉన్నారు.

అందులో ఒకరు శ్రీ సత్య మరొకరు మెరీనా మరొకరు రోహిత్.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా హౌస్ నుంచి మెరీనా ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే మొదట్లో నుంచి మెరీనా ఎవరితో కొట్లాటపడకుండా తన గేమ్ ఏదో తాను ఆడుతూ అందరిని మర్యాదగానే ట్రీట్ చేస్తూ వచ్చింది.ఇది ఇలా ఉంటే ఈ వారం కూడా మెరినాకు ఓట్లు పడ్డాయని కానీ ఆమె కోసం చేసిన కాల్స్ డైవర్ట్ అవ్వడంతో శ్రీ సత్య సేవ్ అయిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటే మెరీనా అలాగే రోహిత్ లను బయటకు పంపించే ఆలోచనలో బిగ్ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది.ఒకవేళ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం మెరీనా ఎలిమినేట్ అయితే భార్యాభర్తలను విడదీసినట్టే అవుతుంది.







