ఈ మధ్య కాలంలో విడుదల అవుతున్న సినిమాలలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తున్నారు.అంతే కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ లో రాబడుతున్నాయి.
ఇక ఇప్పటికే ఏడాది మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ లు అవ్వడంతో పాటు భారీగా కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే.కాంతార, కార్తికేయ 2, సీతారామం లాంటి సినిమాలు మంచి కలెక్షన్లలో సాధించాయి.
ఈ సినిమాలు వాటిని నిర్మించిన బడ్జెట్ కంటె ఎక్కువగానే కలెక్షన్స్ ను తెచ్చిపెట్టాయి.అయితే ఈ కొవ్వలికే వస్తోంది మలయాళ సినిమా అయినా జయ జయ జయ జయహే.
ఆరు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 40 కోట్లకు పైగా వసూలను సాధించి రికార్డు సృష్టించింది.నిర్మాతలకు 10 రెట్లు లాభాలను అందించింది.
కంటెంట్ ఉంటే ఏ భాష ప్రేక్షకుడు అయినా ఆదరిస్తాడు అన్న విషయాన్ని ఈ సినిమా మరొకసారి నిరూపించింది. బసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ కలిసి నటించిన ఈ సినిమా అక్టోబరు 28 న విడుదల అయ్యింది.
అయితే ఆరు కోట్ల బడ్జెట్ తో దర్శకుడు విపిన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కించిన ఈ సినిమా ఊహించని విధంగా కలెక్షన్స్ తెచ్చి పెట్టింది.ఇకపోతే ఈ సినిమా కథ ఏమిటి అన్న విషయానికి వస్తే.
సినిమాలో జయ భారతి అనే స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి, పెళ్లి తర్వాత కూడా అదే విధంగా చదువుతూ ఉద్యోగం చేయాలి అన్నది ఆమె ఆశయం.అందుకు రాజేష్ అంగీకరిస్తాడు.

కానీ పెళ్లి తర్వాత అతనిలో పురుష అహంకారం మేలుకొనడంతో చిన్నదానికి పెద్ద దానికి కోపం ప్రవర్తిస్తూ ఉంటాడు.అన్ని విషయాలలో కూడా అతనిదే పై చేయిగా ఉండాలి అనుకుంటాడు.ఆ విషయాన్ని జయభారతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో సర్దుకుని వెళ్ళమ్మా అని వాళ్లు సర్దిచెబుతారు.అప్పుడు జయ భారతి రాజేష్ నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఇరువురి బంధం ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలతో ఈ సినిమా సాగుతుంది.అయితే ఇటువంటి కాన్సెప్ట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినప్పటికీ దీనిని న్యూ ఏజ్ డ్రామాగా తీర్చిదిద్దడంతో వారి మధ్య సన్నివేశాలు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.దాంతో ఈ సినిమాను విజయపథంలో నడిపించాయి.
కాగా ఈ సినిమాను కేవలం 42 రోజుల్లో మాత్రమే నిర్మించారు.







