బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ అనంతరం తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో నటిస్తున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ కె.
జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు అంచనాలు పెట్టుకున్నారు.
రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచిన ప్రభాస్ సలార్ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నారు.ఇక ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ నటుడు సతీమణి చేసినటువంటి కామెంట్స్ అవుతున్నాయి.ఈ సినిమాలో మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈయన కీలక పాత్రలో నటిస్తుండగా షూటింగ్ లొకేషన్లోకి తన భార్య కూడా వెళ్లారు.ఈ క్రమంలోని ఈమె ప్రశాంత్ నీల్ కలిసి దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ క్రమంలోనే ఫోటోని షేర్ చేసిన ఈమె సలార్ సెట్స్‌కి విచ్చేసే సువర్ణవకాశం నాకు దక్కింది. ప్రశాంత్ నీల్ సార్.మీరు సొంత లీగ్‌లో తీస్తోన్న ఈ సినిమా కచ్ఛితంగా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది.మీ విజన్ ఊహించుకుంటేనే రోమాలు నిక్క బొడుచుకుంటున్నాయి.
ఇలా మీ సెట్ కు రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ సుప్రియ ఇంస్టాగ్రామ్ వేదికగా సలార్ సినిమా గురించి చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ పోస్ట్ చూసినటువంటి ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా సలార్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా చేసింది.







