దక్షిణ సినీ ఇండస్ట్రీ లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా సత్తా చాటుతూ టాప్ రెమ్యునరేషన్ అందుకుంటుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. హీరోలకు సైతం అన్ని విషయాల్లో పోటీగా నిలుస్తూ సూపర్ స్టార్ అనిపించు కుంటుంది.
తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకున్న నయన్ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.
ఈమెకు నచ్చకపోయినా.
ఈమె కండిషన్స్ ఒప్పుకోక పోయిన ఎంత స్టార్ పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.ఎన్ని కోట్లు ఆఫర్ ఇచ్చిన నిర్మొహమాటంగా నో అని చెప్పేస్తుంది.
ఇక దర్శక నిర్మాతలు కూడా ప్రెజెంట్ ఈమె టైం నడుస్తుంది అని నోరు మెదపడం లేదు.ఆమె ఎన్ని కండిషన్స్ పెట్టినా ఓకే చెబుతూ వస్తున్నారు.
అయితే నయనతార ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన కూడా ఈమె అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించలేక పోయింది.వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న కూడా హిట్స్ మాత్రం పెద్దగా రావడం లేదు.
అలాగే ఈమె ముందు నుండి చిన్న పిల్లల, ఫ్యామిలీ ఆడియెన్స్ మెప్పు పొందలేక పోతుంది.మరి ఇప్పుడు ఈ రెండు వర్గాలనే టార్గెట్ గా పెట్టుకుందట.త్వరలోనే నయనతార బర్త్ డే సందర్భంగా ఆమె భర్త విఘ్నేష్ శివన్ నయన్ తో కలిసి ఒక సినిమాను నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారట.

ఈమె తన 81వ ప్రాజెక్ట్ కోసం మరోసారి నిర్మాతగా మారబోతున్నారట.ఫ్యామిలీ ఆడియెన్స్ ను చిన్న పిల్లలను టార్గెట్ చేస్తూ డైరెక్టర్ దురై సెంథిల్ కుమార్ ఈ సినిమా కథను రెడీ చేశారట.ఈ సినిమా ఆద్యంతం కూడా ఒక ఇన్నోవేటివ్ పాయింట్ తో కథ సాగుతూ ప్రేక్షకులను మెప్పించే ఆసక్తికర అంశాలను జోడించి సినిమాను విఘ్నేష్ శివన్ నయన్ తో కలిసి నిర్మించబోతున్నారట.
చూడాలి మరి ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో.







