Amala thamila movie : అమల నటించిన ఒక సినిమా జనాల ఆగ్రహానికి గురై బ్యాన్ అయ్యిందని మీకు తెలుసా ?

నాగార్జున భార్యగానే అమల ఇప్పటి యువతకు బాగా పరిచయం.లేదంటే హీరో అఖిల్ కి తల్లిగా మాత్రమే తెలుసు.

 Do You Know About Amala Thamila Movie Banned , Amala, Thamila Movie, Videhi, Sat-TeluguStop.com

కానీ ఆమె ఒకప్పుడు అనేక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ సినిమాల్లో దాదాపు 60 కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.ఆమె ఎక్కువగా తమిళ సినిమాల ద్వారానే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇక అమల పుట్టింది మరియు పెరిగింది అంత కూడా కలకత్తా లో అయినా ఆమె తండ్రి నావి ఆఫీసర్ కాగా, తల్లి మాత్రం ఐరిష్.ఇక తండ్రి ఉద్యోగ రీత్యా మద్రాసు కి షిఫ్ట్ కావడం తో అమల అక్కడే భారత నాట్యం లో శిక్షణ తీసుకుంది.

అమలకు డ్యాన్స్ అంటే మహా ఇష్టం.అందుకే ప్రపంచ వ్యాప్తంగా అనేక స్టేజి షో లు ఇచ్చింది.ఇక ఆమె తమిళం లోనే తొలుత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా, తెలుగు లో మాత్రం నాగార్జున సరసన కిరాయి దాదా సినిమాలో నటించింది.ఇక ఈ సినిమాతో నాగార్జున పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది.

ఇక ఆ తర్వాత అన్ని విషయాలు మీకు తెలిసినవే.ఆ విషయం కాసేపు పక్కన పెడితే అమల తమిళం లో ముప్పై వరకు సినిమాల్లో నటించింది.

అయితే వివాదాలకు చాల దూరం గా ఉండే అమల తాను నటించిన ఒక సినిమా ద్వారా మాత్రం పెద్ద వివాదంలోనే ఇరుక్కుంది.

Telugu Amala, Nagarjuna, Sathya Raj, Thamila, Tollywood, Videhi-Latest News - Te

ఇక మొదటి నుంచి తమిళులకు ద్రావిడ సంస్కృతి అంటే మహా అభిమానం.అందుకే చాల మంది తమిళులు బ్రాహ్మణా వ్యతిరేఖ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే వారు.ఇక అలాంటి వారి రచనలతో కూడా సినిమాలు వచ్చేవి.

ఆలా భారతి రాజా దర్శకత్వం లో వచ్చిన వేదం పుదిదు అనే సినిమా తెలుగు వైదేహి పేరుతో కూడా దబ్ అయ్యింది.ఈ సినిమా బ్రాహ్మణా వ్యతిరేఖ చిత్రం గా వచ్చింది.

ఈ సినిమాలో అమల హీరోయిన్ కాగా సత్య రాజ్ హీరో గా నటించాడు.అమల తమిళ బ్రాహ్మణా స్త్రీ పాత్రలో నటించగా, ఈ సినిమా అప్పట్లో బ్రాహ్మణుల ఒత్తిళ్ల వల్ల బ్యాన్ కి గురిఅయింది.

ఒక బ్రాహ్మణా అమ్మాయిని నాస్తికుడు అయినా హీరో ప్రేమించడం బ్రాహ్మణా సమాజం ఒప్పుకోలేదు.ఆలా అమల నటించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube