Golden Blood Group : ప్రపంచంలో ఈ బ్లడ్‌గ్రూప్‌ 45 మందిలోనే ఉంది.. ధర బంగారం కన్నా ఎక్కువే!

మనిషి శరీరంలో 8 బ్లడ్ గ్రూపులు ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే.

ఏ+, ఏ-, బీ+, బీ-, ఓ+, ఓ-, ఏబీ+, ఏబీ- ఇలా మొత్తం ఎనిమిది బ్లడ్ గ్రూపులు మాత్రమే మనిషి శరీరంలో కనిపిస్తాయి.

అత్యవసర పరిస్థితుల్లో ఈ రక్తం కొనుక్కోవాలంటే కొన్ని వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక అరుదైన బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకున్నారు.

ఈ రక్తం కొనాలంటే లక్షలు వెచ్చించాల్సిందే.ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు కేవలం 45 మందే ఉన్నారట.

అరుదైన బ్లడ్ గ్రూప్‌ను గోల్డెన్ బ్లడ్ గ్రూప్‌గా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు.Rhnull అని వైద్య పరిభాషలో పిలిచే ఇది చాలా అరుదుగా కనిపించే బ్లడ్ గ్రూప్.

Advertisement

దీనిలో చుక్కలవారీగా ఉండే ద్రవం ప్రాణాలను రక్షించే లక్షణాలు కలిగి ఉండడంతో ఈ బ్లడ్ గ్రూప్‌కి విలువ ఎక్కువ.ప్రపంచంలో బ్లడ్ గ్రూప్ ఉన్న 45 మంది వరకు ఉన్నప్పటికీ వీరిలో 9 మంది మాత్రమే రక్తదానం చేయగలరట.

మిగిలిన వారిలో కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా మరికొంత మంది రక్తదానం చేయడానికి ఇష్టపడటం లేదు.

ఈ బ్లడ్ గ్రూప్ చాలా రేర్ కాబట్టి ఒక చుక్క రక్తం ధర ఒక గ్రాము బంగారం కంటే ఎక్కువట.అందుకే దీన్ని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు.ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారిలోనూ రక్త హీనత జబ్బు ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు.

ఇక ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారి పేర్లను భద్రత కారణాల దృష్ట్యా బయటకు వెల్లడించలేదు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు