మన దేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.అంతేకాకుండా చేతి రేఖలను కూడా నమ్ముతారు.
ప్రస్తుతం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడి సంచారం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది.శుక్ర గ్రహం అంటే అందరి జీవితాలతో శుభాలను ఇచ్చే గ్రహం అని అందరూ నమ్ముతారు.
ఎవరి రాశిలో అయితే శుక్రుడు సంచారం గట్టిగా ఉంటుందో వారి జీవితం అద్భుతంగా ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, శుక్రుడు శత్రువులుగా జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతూ ఉంటారు.
సూర్యుడు, శుక్రుడు కలవడం వల్ల ఈ రాశుల వారిపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది.ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.మేష రాశి వారు శుక్రుడు, సూర్యుని కలయికతో నవంబర్ నెలలో జాగ్రత్తగా ఉండడం మంచిది.ఈ నెలలో మేష రాశి వారి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ ఉంచడం మంచిది.
ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.మేష రాశి వారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం అంత మంచిది కాదు.
వారు పని చేసే ఆఫీసులో సహ ఉద్యోగులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది.
మిధున రాశి వారికి శుక్రుడు, సూర్యుని కలయిక చాలా ప్రమాదమని జ్యోతిష్య శాస్త్రాన్ని నిపుణులు చెబుతున్నారు.
ఈ రాశి వారు వాదనలు, వాగ్వాదాలు గొడవల నుండి చాలా దూరంగా ఉండడమే మంచిది.ఈ సమయంలో కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.మీరు దూర ప్రయాణం చేయకపోవడం మంచిది.
కర్కటరాశి వారికి శుక్ర, సూర్య కలయిక విషయంలో చాలా జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి తో వీరికి గొడవలు జరిగే అవకాశం ఉంది.ఈ సమయంలో వీరికి వ్యాపారంలో నష్టాలు జరిగే అవకాశం ఉంది.
ఈ రాశి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.లేదంటే ప్రమాదాలు జరగవచ్చు.