బుల్లితెర సీరియల్స్ లో సహాయ పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నటి మృణాల్ ఠాకూర్.ఈమె పలు సీరియల్స్ లో నటించే సందడి చేయడమే కాకుండా మెల్లిగా వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు.
పలు మరాఠీ సినిమాలలో నటించి సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.అయితే తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు.అద్భుతమైన ప్రేమ కావ్యంగా,ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ సీతా మహాలక్ష్మి పాత్రలో అచ్చ తెలుగు అమ్మాయిల ఎంతగానో ప్రేక్షకులను సందడి చేశారు.
ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈమె తెలుగులో వరుస సినిమాలతో బిజీ అవుతారని అందరూ భావించారు.అయితే ఈమె ఒక మంచి బ్లాక్ బాస్టర్ సినిమాని అందుకున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క సినిమాకు కూడా సైన్ చేయకుండా పూర్తిగా సైలెంట్ అయ్యారు.అయితే తనకు సీతారామం సినిమా తర్వాత మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ ఈమె మాత్రం ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.
అందుకు కారణం కేవలం రెమ్యూనరేషన్ మాత్రమేననీ తెలుస్తుంది.సీతారామం సినిమా మంచి విజయం కావడంతో ఈమె తన తదుపరి సినిమాలకు కోట్లలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో తన వరకు వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోతున్నాయని తెలుస్తోంది.
అదేవిధంగా తన తదుపరి సినిమాల విషయంలో కూడా నటి మృణాల్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం.అందుకే ఇప్పటివరకు తాను ఒక సినిమాకు కూడా సైన్ చేయలేదని తెలుస్తుంది.