సాధారణంగా సినీ రంగంతో పాటు ఇతర రంగాలలో ఎక్కడ చూసినా కూడా లైంగిక వేధింపులు అన్నవి జరుగుతూనే ఉంటాయి.ఈ మధ్యకాలంలో అయితే ఈ లైంగిక వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి.
అయితే ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది హీరోయిన్ లు లైంగిక వేధింపులకు గురి అయినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.కేవలం హీరోయిన్లు మాత్రమే కాకుండా పలు సందర్భాలలో పలువురు హీరోలు కూడా లైంగిక వేధింపులకు గురి అయినట్లు తెలిపారు.
కాగా కాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది ఈ లైంగిక వేధింపులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.పలువురు ధైర్యం చేసి మీడియా ముందు నోరు విప్పగా ఇంకొందరు మాత్రం ఆ విషయాలు బయట పెడితే ఎక్కడ అవకాశాలు తగ్గిపోతాయో అని బయటపడటం లేదు.
ఇప్పటికే ఎంతో మంది డైరెక్టర్లు నిర్మాతలపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.స్టార్ హీరోయిన్ల నుంచి మోడల్స్ వరకు ఎంతోమంది ఈ లైంగిక వేధింపులను ఎదుర్కొనట్లు తెలిపారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక బాలీవుడ్ స్టార్ హీరో తాను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టు తెలుపుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఆ హీరో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్.అయితే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు అవుతున్న ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించని రణ్‌వీర్ సింగ్ తాజాగా లైంగిక వేధింపుల విషయం గురించి బయట పెట్టేశాడు.
కాగా ఇటీవల రణ్‌వీర్ సింగ్ మర్రకేచ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.నా కెరీర్ స్టార్టింగ్ లో ఓ వ్యక్తి నన్ను కలిశాడు.నువ్వు బాగా కష్టపడతావా? లేక తెలివిగా కష్టపడతావా? చూసేందుకు హార్డ్ వర్కర్‌లాగా కనిపిస్తున్నావు.అలా అతను నాతో మాట్లాడే సమయంలోనే సెక్సీ, డార్లింగ్, బి స్మార్ట్ వంటి పదాలను ఉపయోగించాడు.అలా నా కేరీర్ ప్రారంభమైన మూడున్నరేళ్లలో అటువంటి ఎన్నో చేదు అనుభవాలు చాలానే ఎదురయ్యాయి.
వాటిని ఎదిరించి నిలబడ్డాను.అందుకే ఈ రోజు నేను నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పుకొచ్చాడు రణ్‌వీర్ సింగ్.
అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎప్పుడు ప్రస్తావించని రణ్‌వీర్ సింగ్ విషయాలు బయట పెట్టడంతో ఒక్కసారిగా నెట్టింట్లో ఆ వాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఇప్పటికే రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.
కాగా రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2, ఆర్సీ15 సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.వీటి తర్వాత రణ్‌వీర్ తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.







