Sudigali sudheer bithiri sathi : హీరోయిన్ ముందు సుడిగాలి సుధీర్ ని అవమానించిన బిత్తిరి సత్తి.. వైరల్ వీడియో?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రెండు తెలుగు రాష్ట్రాలలో సుడిగాలి సుధీర్‌ కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

 Sudheer And Bithiri Sathi Fun At Gaalodu Sudigali Sudheer, Jabardasth Show, Gaal-TeluguStop.com

ఒక చిన్న హీరోకి ఉండే రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పవచ్చు.డాన్సర్ గా, కమెడియన్ గా, ఆర్టిస్టుగా, మెజీషియన్ గా ఇలా ప్రతి ఒక రంగంలో కూడా తనదైన ముద్రను వేసుకున్నాడు సుడిగాలి సుధీర్.

ఒకవైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే జబర్దస్త్ లో కమెడియన్ గా చేస్తూ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ,మరొకవైపు సినిమాలలో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

ఇది ఇలా ఉంటే ఇటీవల సుధీర్ కు రెండు మూడు సినిమాలు వరుసగా ఆఫర్లు రావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలకు గుడ్ బాయ్ చెప్పేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమాలు ఇప్పుడు పూర్తి అయ్యి విడుదలకు సిద్ధం కావడంతో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు సుడిగాలి సుధీర్.ఈ నేపథ్యంలోనే ఈరోజు అనగా నవంబర్ 18 సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు సినిమా విడుదల కానుంది.

తాజాగా చిత్ర బృందం సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో,హీరోయిన్‌ సుధీర్‌, గెహ్నా సిప్పిలు బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సరదా సరదగా సాగింది.ఈ క్రమంలోనే బిత్తిరి సత్తి, సుధీర్‌ పై పంచుల వర్షం కురిపించాడు.

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఇంటర్వ్యూ జరిగే చోటుకు వచ్చిన ముగ్గురు నిలబడి ఉంటారు.కొద్దిసేపటి తర్వాత సుధీర్‌ అన్న మనం కూర్చుని మాట్లాడుకుందాం అని అంటాడు.

అప్పుడు సత్తి కుర్చీలు లేవు ఏం లేవు అంటూ ఎవరికో ఫోన్‌ చేస్తాడు.అప్పుడు వెంటనే అరే రాజు! ఓ మూడు కుర్చీలు తీసుకొని రారా చెక్కవి.

మా దోస్తురా.సినిమా చేస్తున్నాడు.

తీసుకురండి,మెట్లు ఎక్కుతున్నావ్‌ అని సుధీర్ వైపు తిరిగి మంచం చెప్పినావ్‌ అని సుధీర్‌ను ప్రశ్నిస్తాడు.ఇందుకు సుధీర్‌ మంచం నేనెందుకు చెప్తానన్నా.

ఇంటర్వ్యూ ఉంటే కుర్చీలు చెబుతా గానీ అంటాడు.అందుకు సత్తి నీ ప్రోగ్రాం అంటే మంచాలు అంటున్నారు అంటూ సెటైర్ వేసాడు.

అప్పుడు సుధీర్‌ నవ్వుతూ కాదన్నా అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube