కృష్ణ మరణించిన రోజు నుంచి అందరి దృష్టి అయన ఆస్తుల పై పడింది.మొదటి నుంచి తన తల్లిని కాదని విజయ నిర్మల తో జీవించిన కారణం గా మహేష్ బాబు కి ఇన్నాళ్ల పాటు ఎలాంటి వివాదాలు లేవు.
కానీ ఇప్పుడు విజయ నిర్మల, ఇందిరా మరియు తండ్రి కృష్ణ అందరు పోయారు.ఇక్కడే వచ్చింది చిక్కంతా.
మహేష్ బాబు తండ్రి కృష్ణ మరియు విజయ నిర్మల ఇద్దరు కష్టపడి చాల డబ్బునే పోగు చేసారు.ఆస్తులు, అంతస్తులు పెంచుకున్నారు.
ఇప్పుడు వాటికి అసలు ఓనర్ ఎవరు అనేది అసలు సమస్య.కృష్ణ ఆస్తికి ఎవరు ఔనన్నా కాదన్న అయన పిల్లలు రమేష్ మరియు మహేష్ మాత్రమే వారసులు.
రమేష్ కన్ను మూసినా కూడా అయన కుటుంబానికి కృష్ణ ఆస్తుల్లో వాటా ఉండాలి.ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి తొలినాళ్లలోనే ఇచ్చిన ఆ తర్వాత కూడా విజయ నిర్మలతో కలిసి చాల ప్రాపర్టీస్ కొనుగోలు చేసారు కృష్ణ.
అందులో ముఖ్యంగా ఎంతో పెద్ద ఆస్థలంలో నానక్ రామ్ గూడ లో ఉన్న ఇంటి గురించి, ఊటీలో కొన్న బంగ్లా గురించి అంత మాట్లాడుకుంటున్నారు.దాదాపు పదెకరాలకు పైగా స్థలంలో కృష్ణ విజయ నిర్మల పెళ్లయ్యాక కలిసి ఒక ఇంటికి నిర్మించారు.
అందులో ఇప్పుడు నరేష్ మరియు విజయ నిర్మల సోదరులు నివసిస్తున్నారు.ఇన్నాళ్ల పాటు తండ్రి ఉన్నాడు కాబట్టి ఆ ఆస్తుల గురించి మహేష్ బాబు పెద్దగా ఆలోచించలేదు.
మరి ఇప్పుడు తండ్రి కూడా పోయాడు.ఆ బంగ్లా మరియు ఆస్తులు అంత కూడా ఎవరికి చెందాలి అనేది పెద్ద ప్రశ్న.నరేష్ ఆదీనంలో ఉన్న ఆస్తులను మహేష్ బాబు ఖచ్చితంగా చేయి చాచి అడిగే ప్రసక్తి ఉండదు.అలాగని వదిలేసి అన్ని అతడికే అప్పచెప్తే ఇక రమేష్ కుటుంబానికి కొంత అన్యాయం జరిగే అవకాశం ఉంది.
మరి ఇలాంటి తరుణంలో నరేష్ మరియు పవిత్ర లోకేష్ కోసం అన్ని వదిలేసి ఊరుకుంటాడా లేక పెద్దల మధ్య కూర్చొని అని వేరు చేసుకుంటారా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలియనుంది.ఇక ఆస్తుల వాటాల విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.