Trisha Krishnan : హీరోయిన్ త్రిష అందం వెనుక షాకింగ్ సీక్రెట్స్.. అదే ఆమె శక్తి అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.

 Trisha Krishnan Says Food She Reason For Her Beauty, Trisha Krishnan, Beauty, To-TeluguStop.com

కాగా ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న త్రిష తమిళంతో పాటు ఇతర భాషల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.కాగాఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఈమె కొన్ని ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అదే క్రేజ్ తో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.

అంతే కాకుండా మూడు పదుల వయసు దాటినప్పటికీ ఇంకా 24 ఏళ్ళ అమ్మాయిగా కనిపిస్తూ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ దూసుకుపోతోంది.

ఇది ఇలా ఉంటే ఇటీవల త్రిష పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో తన అందం అభినయం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.యువరాణి పాత్రలో ఎంతో అందంగా కనిపిస్తూ అద్భుతంగా హవ భావాలు పలికించడంతో అభిమానులు ఫిదా అయిపోయారు.

అయితే చాలామంది అభిమానులకు త్రిష వయసు పెరుగుతున్న కూడా అందం మాత్రం అలాగే ఉంది.ఇప్పటికీ ఇంత అందంగా కనిపించడానికి అందమైన సీక్రెట్ ఏంటి అని అభిమానులు తలలు పెట్టుకుంటున్నారు.

ఇలా త్రిష అంతకంతకు అందంగా తయారవుతోంది? అయితే ఈ విషయంపై స్పందించింది త్రిష.తాను తీసుకునే ఫుడ్డే ఆమె అందానికి కారణం అని తెలిపింది.

Telugu Tollywood, Trisha Krishnan-Movie

మరి ఆహార ఆ పదార్థాలు ఏంటి అన్న విషయాన్నికొస్తే.నాన్ వెజ్, వెజ్ అనే తేడా లేకుండా ఫుల్ లాగించే స్తుందట.విటమిన్ సి ఎక్కువగా వుండే పండ్లను బాగా తింటుందట.అలాగే డ్రై నట్స్ కూడా తగిన మోతాదులో తీసుకుంటుందట.

బిరియానీ అంటే త్రిష కి చాలా ఇష్టమట.అయితే, బిరియానీ తిన్న నెక్స్‌ట్ డే కాస్త ఎక్కువగా వర్కవుట్లు చేస్తుందట.

వర్కవుట్లు అంటే అవేమీ అసాధారణమైనవి కాదండోయ్.చాలా నార్మల్ వర్కవుట్స్‌ చేస్తుందట.

వీటితో పాటుగా ఆమె నాచురల్ అందం కూడా ఒక ఎత్తు అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube