సూపర్ స్టార్ కృష్ణ మృతి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో సంచలనం సృష్టించింది.తెలుగు సినిమా రంగానికి ఎన్నో విశిష్ట సేవలు అందించిన ఆయన కీర్తి కొనియాడుతూ చాలామంది సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతున్నారు.ఈ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ప్రధాని మోడీ సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించారు.”కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో, ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.
ఈ విషాదకర సమయంలో మహేష్ బాబు, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అంటూ తెలుగులో ప్రధాని పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కృష్ణ పార్దివ దేహం ఆయన స్వగృహం నానక్ రామ్ గుడాలో ఉంది.అభిమానుల సందర్శనార్థం.ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుండి గచ్చిబౌలి స్టేడియంలో పార్థివ దేహాన్ని ఉంచనున్నారు.రేపు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
రేపు కృష్ణ అంత్యక్రియలు నేపథ్యంలో ఇండస్ట్రీలో షూటింగ్స్ మొత్తం బంద్.







