ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.ఈ కేసులో బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ లను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.
వీరిద్దరి బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఉత్తర్వులు రానున్న సమయంలో ఈడీ అరెస్ట్ చేసింది.కాగా ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబులను అధికారులు కస్టడీలో తీసుకున్నారు.
శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు ఇచ్చిన సమాచారంతోనే అభిషేక్ రావు, విజయ్ నాయర్ లను అరెస్ట్ చేసినట్లు సమాచారం.







