బాలీవుడ్ అందాల భామ దీపిక పదుకొనే కొత వ్యాపారానికి శ్రీకారం చుట్టింది.రెండేళ్లుగా దాని కోసం కష్టపడి ఫైనల్ తన బ్రాండ్ ని రివీల్ చేసింది.82 ఈస్ట్ అంటూ ఓ సెల్ఫ్ కేర్ బిజినెస్ మొదలు పెట్టింది దీపిక పదుకొనే.ప్రస్తుతం ఇండియాలోనే మొదలు పెట్టిన దీపిక దీన్ని వర్లడ్ వైడ్ గా విస్తరించాలని చూస్తుందట.
ఈ విషయాన్ని దీపిక తన సోషల్ మీడియాలో ఎనౌన్స్ చేసింది.ఓ పక్క సినిమాలు చేస్తూనే బిజినెస్ లు చేయడం సెలబ్రిటీస్ కి అలవాటే.
ఇప్పటికే చాలామంది తమ సొంత బిజినెస్ లు చేస్తుండగా దీపిక కూడా వారి దారిలో వెళ్తుంది.
దీపిక సొంతంగానే తన 82 ఈస్ట్ సెల్ఫ్ కేర్ బ్రాండ్ నడిపించాలని ఫిక్స్ అయ్యింది.
దీనికి తన భర్త రణ్ వీర్ సింగ్ తో ఎలాంటి సంబంధం,లేదని తెలుస్తుంది.దీపిక ప్రస్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్ లో దూసుకెళ్తుంది.ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో కూడా దీపిక హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాలో నటించేందుకు గాను దీపికకు 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు టాక్.
దీపిక పదుకొనే తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ప్రాజెక్ట్ కె.ఈ సినిమాలో అమితాబ్ కూడా నటిస్తున్నారు.