తెలుగులో ఒకసారి నవ్వుతుందా బిగ్ బాస్ 6 షో చూస్తుండగానే అప్పుడే 10 వ వారం ముగింపు దశకు చేరుకుంది.అయితే బిగ్ బాస్ హౌస్ లో గీతూ వెళ్లిపోయిన తర్వాత ఆదిరెడ్డి ప్రవర్తన మాటలు పూర్తిగా మారిపోయాయి.
ఆదిరెడ్డి ఇనయ మీద నోరు పారేసుకోవడం మాత్రమే కాకుండా ఆమెకు హైప్ ఇస్తున్నాడు.అయితే హౌస్ లో అందరూ ఇనయ అని టార్గెట్ చేయడంతో ఆమెకు బయట అది పాజిటివ్ అవుతోంది.
ఇక తాజాగా హౌస్ లో బిగ్ బాస్ ఒక గోనెసంచులో థర్మాకోల్ వేసి ఆ బ్యాగ్ ని ఎవరైతే చివరి వరకు కాపాడుకుంటారో వాళ్లే గెలిచినట్టు అని ప్రకటించడంతో ఆ టాస్క్ లో భాగంగా చివరి వరకు పోరాడి పైమా గెలిచింది.
ఇక ఫైమా కొత్త కెప్టెన్ గా గెలిచిన తర్వాత ఇనయ ను పట్టుకొని ఎమోషనల్ అవ్వడంతో అది చూసిన హౌస్ మేట్స్ ఆశ్చర్యపోయారు.
ఆ తర్వాత రేవంత్ రాజ్ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో శ్రీహాన్ ను మధ్యలోకి లాగుతూ నేను గెలిస్తే రావు కానీ శ్రీ సత్య గెలిస్తే దుప్పటి పట్టుకొని మరి తన దగ్గరకు వెళ్ళిపోతావు అని కామెంట్ చేయడంతో వెంటనే శ్రీహన్ సీరియస్ అవుతూ కామెడీగా అయినా సరే ఏది పడితే అది అనేయకు అంటూ రేవంత్ పై సీరియస్ అయ్యాడు.అప్పుడు రేవంత్ తాను అసలు ఆ మాట అనలేదు అంటూ ముఖాయించాడు.

ఆ తర్వాత బిగ్ బాస్ ఈవారం వరస్ట్ పెర్ఫార్మర్ ను ఎంచుకోమని చెప్పడంతో చాలామంది కంటెస్టెంట్లు ఇనయ ని ఎంచుకున్నారు.ఎక్కువ ఓట్లు ఇనయ కు పడటంతో ఆమెను వరస్ట్ పర్ఫామర్ గా ఎంపిక చేసి జైలుకు పంపించారు.అయితే కుటుంబ సభ్యులు అందరూ ఆమెనే టార్గెట్ చేస్తూ ఉండడంతో ఆమెకు బయట మరింత మద్దతు పెరుగుతుంది.ఈ క్రమంలోనే ఆమెను ఏకంగా జైలుకు పంపించడంతో ఇనయ కు మరింత హైప్ ఇచ్చినట్టు అయింది.
బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు చూస్తుంటే అందరూ కలిసి ఇనయ కు టైటిల్ కట్టబెట్టేలా ఉన్నారు అంటూ వాదనలు వినిపిస్తున్నాయి.







