KCR Unemployees : నిరుద్యోగులే టార్గెట్ గా కేసీఆర్ ? ఆ ఎఫెక్టే కారణం ?

టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రాబోయే సార్వత్రికి ఎన్నికలపై పూర్తిగా దృష్టి సారించారు.తెలంగాణలో 2023 లో ఎన్నికలు జరగబోతుండడం తో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

 Is Kcr Targeting The Unemployed That Effect Is The Reason , Kcr, Telangana, Trs-TeluguStop.com

ఇటీవల జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించడంతో, మరింత ఉత్సాహంగా కేసీఆర్ ఉన్నారు.అయితే మునుగోడులో నమోదైన ఓట్లను కేసిఆర్ విశ్లేషించుకున్నారు.

అన్ని వర్గాల నుంచి సానుకూలమైన స్పందన వచ్చినా.యువత, నిరుద్యోగులు మాత్రం టిఆర్ఎస్ కు దూరంగా ఉన్నారని, ప్రభుత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నారనే విషయం ఆయన గుర్తించారు.

ముఖ్యంగా నిరుద్యోగులు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో విఫలమైందనే అభిప్రాయంతో ఉండడంతో, కేసీఆర్ అలర్ట్ అయ్యారు.
  రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు తమకు దూరం కాకుండా యువ ఓటర్లను లను ఆకర్షించేందుకు సిద్ధమయ్యారు.

దీనిలో భాగంగానే సమగ్ర ప్రణాళికను ఆయన తయారు చేసినట్లు సమాచారం.ఇక ప్రతి నెల ఏదో ఒక నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులకు సూచించారు.ఇప్పటికే 52,000 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.వీటిలో 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది.

పోలీస్ , గ్రూప్ వన్ తో పాటు అనేక ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.వీటితో పాటు మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావాల్సి ఉండడంతో,  వాటిపై సీరియస్ గా దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతూ జీవో విడుదల కావడంతో ఇప్పటి వరకు ప్రకటించిన నోటిఫికేషన్ లు నిలిచిపోయాయి.
 

Telugu Munugodu Effect, Telangana, Telangana Cm, Trs, Un Employees-Political

టీఎస్పీఎస్సీ ప్రస్తుతం అన్ని శాఖలకు లేఖలు పంపించింది.గతంలో గ్రూప్ 2, 3, 4 ఉద్యోగాలు వివరాలు కొత్త రిజర్వేషన్ల ప్రకారం ఖరారు చేసి పంపించాలని, జాబుతాను రివైజ్ చేయాలని సమాచారం అందించారు.అయితే ఇంకా కొన్ని శాఖల విషయంలో క్లారిటీ రాకపోవడంతో, మొత్తం అన్నిటి పైన క్లారిటీ వచ్చిన తర్వాత జాబితా ఇవ్వాలంటూ టిఎస్పిఎస్సి ఆదేశాలు ఇచ్చింది.

రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ కాంగ్రెస్ లు తమను ఏ విషయంలోనూ కార్నర్ చేయకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకే చిన్న చిన్న విషయాల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు.

ముఖ్యంగా నిరుద్యోగుల అంశం ను టార్గెట్ చేసుకుని అన్ని పార్టీలు టిఆర్ఎస్పై ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో,  ఇక వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసి నిరుద్యోగుల మద్దతు తమకు ఉండేలా వరుస వరుసగా ఉద్యోగాలు నోటిఫికేషన్లు జారీ చేస్తూ,  టిఆర్ఎస్ ప్రభుత్వం పై మరింత నమ్మకం ఏర్పడే విధంగా చేసుకోవాలనే లెక్కల్లో కేసిఆర్ నిమగ్నం అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube