ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది.ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ సినిమాతో బన్నీ మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు.ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరి అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది.
ఇక ఈ కాంబో కూడా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే బన్నీతో మరో సినిమా చేయాలని బోయపాటి ట్రై చేసాడు.
అయితే బోయపాటి సరైనోడు తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసాడు.
ఇది అట్టర్ ప్లాప్ అయ్యింది.దీంతో అల్లు అర్జున్ ఆగిపోయాడు అని టాక్ వచ్చింది.
ఇక ఈ లోపులోనే బాలయ్య అఖండ సినిమాను బోయపాటి స్టార్ట్ చేసి భారీ విజయం కూడా అందుకున్నాడు.ఇక ఇప్పుడు బోయపాటి రామ్ పోతినేని తో సినిమాకు కమిట్ అయ్యాడు.
అఖండ ఇచ్చిన విజయ ఉత్సాహంతో ఈ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా తెరకెక్కించడానికి ప్లాన్ చేసారు.
రామ్ పోతినేని బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ‘RAPO20’.

ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్నాడు.మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి హిట్ అందుకుంటారో తెలియదు కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమా కథ ముందుగా బోయపాటి అల్లు అర్జున్ కు వినిపించాడని తాజాగా ప్రచారం జరుగుతుంది.ఈ కథకు బన్నీ కూడా ఒక చెప్పాడని కానీ ఈయన వరుస కమిట్మెంట్స్ కారణంగా డేట్లు ఇవ్వలేక పోయారని.అందుకే ఇదే కథతో వెంటనే రామ్ తో సినిమా స్టార్ట్ చేసాడని ఇప్పుడు లేటెస్ట్ సమాచారం.
మరి ఐకాన్ స్టార్ నుండి వచ్చిన కథ రామ్ కు ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి.ఎందుకంటే ఈయన కెరీర్ కు ఈ హిట్ చాలా అవకాశం.







