అమెరికా వెళ్లి అక్కడే చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి, శాశ్వతంగా అమెరికాలోనే స్థిరపడాలిని,ఎంతో మంది యువతీ యువకులు కలలు కంటుంటారు.భారత్ నుంచీ ఎంతో మంది ఎన్నో ఏళ్ళ క్రితమే వలసలు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు కూడా.
అయితే కరోనా వచ్చిన తరువాత అమెరికా ప్రభుత్వం వలస వాసుల ఎంట్రీ పై నిషేధం విధించడంతో ఎంతో మంది భారతీయ నిపుణులు, విద్యార్ధులు ఇతర దేశాల వైపు ఆకర్షితులయ్యారు.అయితే తాజాగా మరో సారి భారతీయ యువతను, నైపుణ్యం గల ఉద్యోగులను ఆకర్షించడానికి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై వీసా జారీ ప్రక్రియ వేగవంతం చేయనున్నట్టుగా అమెరికా దౌత్య కార్యాలయం ప్రకటించింది.అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెయిటింగ్ సమయం తగ్గిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న వెయిటింగ్ పిరియడ్ ను 2023 నాటికి మరింతగా తగ్గిస్తామని హామీ ఇచ్చింది.
కరోనా తరువాత భారత్ నుంచీ అమెరికా వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయిందని, ఈ పరిణామాలతో హెచ్ 1బి , ఎల్ , బి1 , బి2 వీసాలకు చెందిన సమయం 450 రోజులను ఈ మధ్య కాలంలోనే 270 రోజులకు తగ్గించారు.అయితే
ఇదే 270 రోజుల సమయాన్ని మరింతగా తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా దౌత్య కార్యాలయ సీనియర్ అధికారి వెల్లడించారు.అంతేకాదు భారతీయులకు ఇకపై వీసాల విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు గా కూడా వెల్లడించారు.ఈ క్రమంలోనే భారతీయులకు ఏడాదికి 12 లక్షల వీసాలు జారీ చేసే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.2023 వేసవి కాలం నాటికల్లా తాము అనుకున్న లక్ష్యాలను నేరవేర్చుతామని తెలిపారు.ఇదిలాఉంటే అమెరికా తీసుకున్న నిర్ణయం వలన ఎంతో మంది భారతీయ యువతీ యువకులు, నిపుణులకు మేలు చేకూరుతుందని అంటున్నారు పరిశీలకులు…
.