హైదరాబాద్/నల్లగొండ జిల్లా:అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వామపక్షాల మద్దతుతో గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఛాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్,జగదీష్ రెడ్డి,పువ్వాడ అజయ్ కుమార్,ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు,టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.
Latest Nalgonda News