అనంతపురం జిల్లా కల్యాణదుర్గం టీడీపీలో మరోసారి రచ్చ చెలరేగింది.కుందుర్పి, కంబదూరు, కల్యాణదుర్గం మున్సిపల్ కమిటీల్లో రగడ మొదలైంది.
మండల కమిటీల ఎంపిక సమావేశానికి మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు హాజరైయ్యారు.అయితే వీరి ముందే పార్టీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి.
కుర్చీలతో కొట్టుకోబోయారు.ఈ నేపథ్యంలో రెండు వర్గాలకు మధ్య చెలరేగిన ఘర్షణ తోపులాటకు దారి తీసింది.
సీనియర్ నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన కార్యకర్తలు వినలేదు.దీంతో సమావేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.







