లాక్ డౌన్.గత రెండేళ్ల క్రితం ఈ పదం కూడా మనకు తెలియదు.
కానీ ఈ రెండేళ్లలో ఈ పదాన్ని మనం చాలా సార్లు విన్నాం.దీని వల్ల కష్టాలు కూడా అనుభవించాం.
లాక్ డౌన్ అంటేనే ప్రజలకు ఒణుకు వస్తుంది.మళ్ళీ ఎక్కడ ఈ పేరు వినాల్సి వస్తుందో అని అంతా ఆందోళన చెందుతున్నారు.
అందుకే పొరపాటున ఈ పేరు విన్న అందుకు కారణం తెలుసు కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడించింది.
ఈ వైరస్ కారణంగా ప్రజలంతా రెండేళ్ల పాటు ఇబ్బందులు పడ్డారు.దీని కారణంగా రెండు నెలల పాటు సంపూర్ణ లాక్ డౌన్ పెట్టడం కూడా జరిగింది.
దీంతో ఆర్ధిక సంక్షోభం ఏర్పడింది.రెండేళ్ల తర్వాత వ్యాక్సిన్ వచ్చి ఇప్పుడు మళ్ళీ సాధారణ జీవితాలు గడుపు తున్నారు.
అయితే ఈ క్రమంలోనే నిన్న రాత్రి నుండి సోషల్ మీడియా ఓపెన్ చేసిన వారంతా ఒక విషయం చూసి షాక్ అవుతున్నారు.గత రాత్రి సోషల్ మీడియాలో ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నారా.
అసలు విషయం ఏంటంటే.గత రాత్రి నుండి సోషల్ మీడియా ఓపెన్ చేసిన వాళ్లకు ‘ఇండియన్ లాక్ డౌన్”/em>అంటూ ఒక ట్యాగ్ ట్రెండింగ్ లో కనిపిస్తుంది.
దీంతో ఈ ట్యాగ్ ఏంటో తెలియని వారు ఈ పేరు చూసి కంగారు పడ్డారు.

ఇండియా లాక్ డౌన్ ఏంటో అని షాక్ అయ్యారు.అయితే ఈ పదం ఎందుకు ట్రెండ్ అవుతుంది అంటే.ప్రముఖ ఓటిటి సంస్థ జీ 5 వారు ఒక చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
దాని పేరే ‘ఇండియన్ లాక్ డౌన్’ ఇది నిజమైన లాక్ డౌన్ కాదు ఒక చిత్రం అని తెలుసుకున్న ప్రజలు అప్పుడు రిలాక్స్ అయ్యారు.ఈ సినిమా లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కున్న కష్టాలను, ఇబ్బందుల నుండి స్పూర్తితో తీసిన సినిమా.
ఇది తెలియక ఈ పేరు వినగానే కంగారు పడడం ప్రజల వంతు అయ్యింది.ఎలాగైతేనేం ఈ సినిమా ఈ పేరుతో పాపులర్ అయ్యింది.







