ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.ఇవాళ జరిగిన విచారణలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై వాదనలు జరిగాయి.
ఇందులో భాగంగా ప్రభుత్వ న్యాయవాది జనరల్ బీఎస్ ప్రసాద్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.అదేవిధంగా రాజాసింగ్ తరపు వాదనలను ఎల్ రవిచందర్ మరోసారి వినిపించనున్నారు.
ఈ క్రమంలో విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
రాజాసింగ్ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
ఆయనపై ఉన్న పీడీ యాక్ట్ పిటిషన్ ఎత్తివేస్తేనే బెయిల్ వచ్చే అవకాశాలున్నాయి.అయితే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పెట్టడాన్ని అడ్వైజరీ బోర్డు కూడా సమర్థించింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







