బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో వర్ష ఇమ్మానియేల్ జంట ఒకటి.జబర్దస్త్ కార్యక్రమంలో రష్మి సుధీర్ జంట ఎంత పాపులర్ అయిందో వీరు కూడా అదే విధంగా పాపులర్ అయ్యారు.
ఇమ్మానియేల్ వర్ష ఇద్దరు ఫుల్ ఆపోజిట్ కలర్ లో ఉన్నప్పటికీ వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.దీంతో మల్లెమాలవారు వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుపుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే ఇదివరకే వీరిద్దరూ ఎన్నోసార్లు ప్రేమలో ఉన్నట్టు పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ పెద్ద ఎత్తున రిలేషన్ గురించి తెలియజేసినప్పటికీ అది కేవలం స్కిట్ వరకు మాత్రమే పరిమితం నిజజీవితంలో వీరిద్దరూ మంచి స్నేహితులని వెల్లడించారు.
ఇకపోతే వీరి గురించి ఈ విధమైనటువంటి వార్తలు పెద్ద ఎత్తున రావడంతో గత కొద్ది రోజులుగా ఈ జంట దూరంగా ఉండడం గమనార్హం.
తాతగా జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ తిరిగి మాట్లాడుకోవడం జరిగింది.అయితేప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వారికి సంబంధించిన ఎన్నో వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు ఈ క్రమంలోనే ఇమ్మానియేల్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ వీడియోలో భాగంగా ఇమ్మానియేల్ వర్షకి ఖరీదైన బంగారు ఆభరణాలను కానుకగా ఇచ్చారని తెలుస్తోంది.వచ్చే నెలలో వర్ష పుట్టినరోజు ఉండటంతో తనకు ఖరీదైన నెక్లెస్ కానుకగా ఇచ్చినట్టు ఈ వీడియో ద్వారా తెలియజేశారు.అయితే ఈ వీడియో చివరిలో ఇది కేవలం ప్రమోషన్ కోసం మాత్రమేనని, తనకు ఎలాంటి నగలు కొనిపెట్టలేదని చెప్పి చిన్న ట్విస్ట్ ఇచ్చారు.మొత్తానికి వర్ష ఇమ్మానియేల్ చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







