సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెట్ స్టార్ ప్లేయర్ ఏబి డివిలియర్స్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఈ ఏడాది T20 వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందని జోష్యం చెప్పారు.
ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుందని.తన అంచనా తెలియజేశారు.
ఇండియా టీంలో సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నారు.అలాగే మిగతా టీమిండియా ప్లేయర్స్ మంచి టాలెంటెడ్.
కాబట్టి ఈ ఏడాది వరల్డ్ కప్ ఇండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఏబి డివిలియర్స్ చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే నవంబర్ 10 వ తారీకు సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ తో భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడే అవకాశాలు లేవని వార్తలు వస్తున్నాయి.ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ కుడి చేతికి బలమైన గాయం తగలడంతో… మ్యాచ్ లో ఉండకపోవచ్చు అని అంటున్నారు.
దీంతో భారత్ క్రికెట్ ప్రేమికులు ఈ వార్తపై నిరుత్సాహం చెందుతున్నారు.రోహిత్ త్వరగా కోలుకొని ఆడాలని భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు.







