Trump America : త్వరలో సంచలన ప్రకటన...ట్రంప్ స్టేట్మెంట్ తో బుర్రలు గోక్కుంటున్న అమెరికన్స్...!!

అమెరికా మాజీ అధ్యక్షుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డోనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంటుంది.ట్రంప్ ఏం మాట్లాడినా సంచలనమే, ఏం చేసినా అదో పెద్ద వార్తే.

 Sensational Announcement Soon Americans Are Scratching Their Heads With Trump's-TeluguStop.com

తాజాగా ట్రంప్ ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ తో అమెరికా ప్రజల బుర్రలు హీట్ ఎక్కిపోతున్నాయట.అంతేకాదు ట్రంప్ బాద్ షా లెవిల్ లో ఇచ్చిన ఆ స్టేట్మెంట్ తో ఆయన అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారట ఇంతకీ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి.

అసలేం జరిగిందంటే.వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం, రేపు అనేది మనకు ఎంతో ముఖ్యం రానున్న భవిష్యత్తు రేపటికి నాంది కావాలి అంటూ త్వరలో కీలక ప్రకటన చేయబోతున్నాను అంటూ ట్రంప్ ఓ స్టేట్మెంట్ ఇచ్చి పారేశారు.

నిన్నటి రోజున ఓహియో లో మధ్యంతర ఎన్నికల సందర్భంగా అభిమానుల కోలాహలాల మధ్య ట్రంప్ ఈ ప్రకటన చేశారు.మనకు ఎన్నికలు అనేవి ఎంత కీలకమో తెలుసు అందుకే దాని నుంచీ తప్పుకోకుండా అంటూ అసంపూర్తిగా ప్రకటన చేసి నవంబర్ 15 న మంగళవారం నాడు ఫ్లోరిడాలోని ఫామ్ బీచ్ లోని మార్ ఏ లాగోలో అతి పెద్ద ప్రకటన చేస్తున్నానని వెంటనే ప్రసంగాన్ని ఆపేసి వెళ్ళిపోయారు.

Telugu American, Donald Trump, Farm Beach, Florida, Republican, Trump-Telugu NRI

ఇక ఆ క్షణం మొదలు కొని స్థానిక మీడియాలో ట్రంప్ ఏం చెప్పబోతున్నారు అంటూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.మరోవైపు ఆయన 2024 లో పోటీ చేయబోతున్నారని అందుకే అలాని ప్రకటన చేశారని, ఆ విషయాన్ని స్వయంగా తానే చెప్పబోతున్నాడని అభిమానులు అంటున్నారు.ఇదిలాఉంటే ఒక పక్క మధ్యంతర ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి షాక్ ఇవ్వనున్నారని, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ కి ప్రజలు మద్దతు ఇవ్వబోతున్నారని సర్వేలు వెల్లడించడంతో ట్రంప్ భవిష్యత్తు రాజకీయాలపై మరింత స్పీడు పెంచే అవకాశం ఉందని అందులో భాగంగానే ఈ తరహా ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు పరిశీలకులు.ఏది ఏమైనా ట్రంప్ 15 న ఎలాంటి ప్రకటన చేయబోతున్నారోననే ఆసక్తి అందరిలో నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube