Ram Charan Shankar : RC15 నెక్స్ట్ షెడ్యూల్ డేట్ ఫిక్స్.. పాటల కోసం ప్రత్యేక లొకేషన్స్!

మెగాస్టార్ వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్.ఇక ఈ మధ్యనే అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటించాడు.

 Ram Charan Resumes The Shoot Of Rc15 At New Zealand-TeluguStop.com

ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ గా సక్సెస్ అయ్యాడు.ప్రెజెంట్ ఈయన లైనప్ కూడా ఇదే రేంజ్ లో సెట్ చేసుకుంటున్నాడు.

ఇక రామ్ చరణ్ తన భార్యతో కలిసి జపాన్ లో ప్రొమోషన్స్ కోసం వెళ్లి ఆ తర్వాత టాంజానియా ట్రిప్ లో వీరిద్దరూ మరి కొద్దీ రోజులు గడిపారు.ఈ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇక ఇటీవలే వీరు ఈ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.ఇక చరణ్ మళ్ళీ తన షూటింగ్ లో బిజీ కానున్నాడు.

ప్రెజెంట్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనే విషయం తెలిసిందే.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగి పోయాయి.ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ నవంబర్ 20 నుండి స్టార్ట్ చేయనున్నారట.ఈ లోపే టీమ్ మొత్తం న్యూజిలాండ్ చేరుకోనున్నారట.

Telugu Dil Raju, Shankar, Kiara Advani, Ram Charan, Ramcharan, Rc-Movie

ఇక 20వ తేదీ నుండి ఈ సినిమా నాన్ స్టాప్ షూట్ జరగనుంది అని టాక్.ఈ షెడ్యూల్ మొత్తం పాటల మీదనే శంకర్ ఫోకస్ చేయనున్నాడట.న్యూజిలాండ్ లో ఒక ప్రత్యేక సాంగ్ షూట్ చేయనున్నట్టు టాక్.ఈ పాటలు పూర్తి అయితే సినిమా ఆల్ మోస్ట్ పూర్తి అయినట్టే.ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకోగా.దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube