ఈమధ్య ట్విట్టర్ విషయంలో తరచూ వచ్చిన వార్తల్ని మీరు చూసే వుంటారు.ట్విట్టర్ తాజా చైర్మన్ ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా అధినేత ‘ఎలాన్ మస్క్’ సోషల్ నెట్‌వర్క్ కంపెనీ ‘ట్విటర్’ను ఈమధ్యనే టేకోవర్ చేసుకున్న సంగతి తెలిసినదే.
ఇలా ట్విట్టర్ ని సొంతం చేసుకున్నాడో లేదో… అందులో పనిచేసే హై కేడర్ ఉద్యోగస్తులకు షాక్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే.ఇకపోతే మాస్క్ ట్విట్టర్ విషయంలో విపరీత ఆదాయ మార్గాలపై అన్వేషణ మొదలుపెట్టారు.
ఇందులో భాగంగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన, ‘బ్లూటిక్ మార్క్’ సబ్‌స్ర్కిప్షన్‌పై ఫీజు వంటి సమాలోచన చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ క్రమంలో ఓ విషయం ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
ట్విటర్‌ను అభివృద్ధి పధంలో నడిపించడానికి మస్క్ ప్రధాన టీమ్‌లోని ‘ఓ ఐదుగురు’ గురించి బాగా ఇపుడు బాగా వినబడుతోంది.అందులో మొదటివాడు మస్క్ ఆస్తులను నిర్వహించే ఫ్యామిలీ ఆఫీస్ హెడ్ అయినటువంటి ‘జారెడ్ బిర్చల్.’ జారెడ్ బిర్చల్ ని 2016లో ఎలాన్ మస్క్ స్వయంగానియమించుకున్నారు.ఇక ఈ లిస్టులో రెండవది మస్క్ సన్నిహితుడైన ఎంట్రప్రెన్యూర్ జాసన్ కలకనిస్.
జాసన్ కలకనిస్ ఓ అద్భుయమైన పారిశ్రామికవేత్త.ఎలాన్ మస్క్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది.
బ్లూటిక్ మార్క్ సబ్‌స్ర్కిప్షన్‌పై ఫీజు ఐడియాను మొదట వెల్లడించిన వ్యక్తి ఈయనే.

ఆ తరువాత 3వ వ్యక్తి మన భారతీయ మూలాలున్న ‘శ్రీరామ్ క్రిష్ణన్’. ఈయన ఎలాన్ మస్క్‌కు మంచి సన్నిహితుడు, ట్విటర్ మాజీ ఉద్యోగి కూడా.ఈ వరుసలో నాల్గవది ‘అలెక్స్ స్పిరో.’ ఈయన పేరుగాంచిన సెలబ్రిటీ లాయర్.ఎలాన్ మస్క్‌కు ఎంతోకాలంగా న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు.
ట్విటర్ ఉద్యోగుల తొలగింపు చర్యలకి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఈయన పర్యవేక్షిస్తున్నారు.ఇక ఇందులో ఆఖరివాడు ‘డేవిడ్ సాక్స్.’ డేవిడ్ సాక్స్ కూడా ఎలాన్ మస్క్‌కు అత్యంత సన్నిహితుడు.మస్క్ మాదిరిగానే డేవిడ్ సాక్స్ దక్షిణాఫ్రికాలోనే పుట్టాడు.
వీరు ఐదుగురు మాస్క్ కి అండదండగా ఉంటారని సమాచారం.







