తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అరుంధతి, బాహుబలి, భాగమతి లాంటి సినిమాలలో నటించి భారీ పాపులారిటీని సంపాదించుకుంది అనుష్క.
అయితే అనుష్క శెట్టి నటించిన జీరో సైజ్ సినిమా ఆమెకు చాలావరకు సమస్యలన్నీ తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు.జీరో సైజ్ సినిమా కోసం అనుష్క భారీగా బరువు పెరిగింది.
కానీ బరువు తగ్గలేకపోయింది.వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉండటం వల్ల ఫిట్నెస్ పై ఫోకస్ చేయలేకపోయింది స్వీటీ.
బాహుబలి రెండు భాగాలు, భాగమతి, నిశ్శబ్దం చిత్రాల్లో నటించింది.ఆ తరువాత అనుష్క బరువు తగ్గాలని బలంగా నిర్ణయించుకుందో ఏమో కానీ ఆమె సినిమాలను చేయడమే మానేసింది.
దీంతో ఆమె పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు కూడా వినిపించాయి.అయితే సినిమాలకు దూరంగా ఉన్నా అనుష్క యోగా వ్యాయామం అలాగే స్పెషల్ డైట్ తో బరువు తగ్గింది.
కానీ న్యూ లుక్ కి సంబంధించిన ఫోటో ని మాత్రం బయట పెట్టలేదు అనుష్క.కానీ ఎట్టకేలకు అనుష్క న్యూ లుక్ కి సంబంధించిన ఫోటో బయటకు వచ్చింది.
తాజాగా నవంబర్ 7న ఆమె పుట్టినరోజు సందర్భంగా అనుష్క కొత్త సినిమాకు సంబంధించిన లుక్ ని యూ వి క్రియేషన్స్ రిలీజ్ చేసింది.అందులో అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది.
ఆ సినిమాలో అనుష్క అన్విత రవళి శెట్టి అనే పాత్రలో కనిపించనుంది.
చెఫ్ గెటప్‌లో వంట చేస్తున్న అనుష్క ఫోటో ను చూస్తే స్వీటీ చాలా స్లిమ్ గా మారింది.ఆ లుక్ చూసిన ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఎట్టకేలకు తమ అభిమాన హీరోయిన్ సన్నబడిందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
యువీ క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి హీరో హీరోయిన్ లుగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.మహేష్.పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.