బాలీవుడ్ హీరోయిన్స్ రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.కాగా బాలీవుడ్ నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినా సాజిద్ ఖాన్ పై షెర్లిన్ చోప్రా ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
కాగా ఈ విషయంలో రాఖీ సావంత్ సాజిద్ ఖాన్ కు మద్దతుగా మాట్లాడడంతో ఈ వివాదం మరింత ముదిరింది.దీంతో వారిద్దరూ ఒకరిపై మరొకరు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్ లో రాఖీ సావంత్ పై ఫిర్యాదు చేసినట్లు షెర్లిన్ చోప్రా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
పోలీసులకు ఫిర్యాదు చేసిన షెర్లిన్ చోప్రా అనంతరం మీడియాతో ముచ్చటిస్తూ ఒక వీడియోని చూపిస్తూ రాఖీ సావంత్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
నా గురించి కాదు బయట మాట్లాడాల్సింది.మొదట మీ సోదరుడు రాజ్ కుంద్రా గురించి బహిర్గతం చేయి అంటూ సవాల్ విసిరింది.సాజిద్ ఖాన్‌పై మీటూ ఆరోపణలు చేసినవారు చెప్పిందంతా అబద్ధమేనా అంటూ రాఖీ సావంత్ పై షెర్లిన్ చోప్రా మండిపడింది.కాగా రాఖీ సావంత్ ఆమె లాయర్ కూడా ఆధారాలతో సహా షెర్లిన్ చోప్రా పై కేసు పెట్టినట్లు తెలిపారు.
షెర్లిన్ చోప్రా డబ్బు కోసం శక్తివంతమైన వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేస్తుందని రాఖీ సావంత్ ఆరోపించింది.2018లో సాజిద్ ఖాన్‌పై మీటూ ఉద్యమంలో ఆరోపణలు రావడంతో పలువురు నటీమణులు లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు.షెర్లిన్‌తో పాటు సలోని చోప్రా, అహానా కుమ్రా, మందన కరిమి సహా అతనిపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఈ వివాదం ఇంకా ఎంత వరకు వెళ్తుందో చూడాలి మరి.