ప్రస్తుతం సమ్మర్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.మండే ఎండలు, ఉక్కపోత, వడ గాలుల దెబ్బకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.
ఈ కాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్, నీరసం, అలసట వంటి రకరకాల సమస్యలు తీవ్రంగా మదన పెడతాయి.అందుకే ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
ముఖ్యంగా గుండె సంబంధిత జబ్బులతో బాధ పడే హార్ట్ పేషెంట్స్ సమ్మర్ సీజన్‌లో ఖచ్చితంగా కొన్ని కొన్ని జాగ్తత్తలు తీసుకోవాలి.ఆ జాగ్రత్తలు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
హార్ట్ పేషెంట్స్ డీహైడ్రేషన్‌కు గురైతే చాలా ప్రమాదం.ఆ సమయంలో గుండె ఆగిపోవడం, రక్తం గడ్డకట్టడం, రక్తపోటు స్థాయిలు పడిపోవడం వంటివి జరుగుతాయి.అందుకే హార్ట్ పేషెంట్స్ వాటర్‌తో పాటు కొబ్బరి నీళ్లు, సబ్జా వాటర్, బార్లీ జావ, పండ్ల రసాలు, మజ్జిగ వంటి పానియాలను తరచూ తీసుకుంటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
అలాగే వ్యాయామాలు ఆరోగ్యానికి మంచివే.
కానీ, హార్ట్ పేషెంట్స్ సమ్మర్‌లో ఎక్కువ సేపు వ్యాయామాలు చేస్తే గుండెపై ఒత్తిడి పెరిగిపోతుంది.ఈ క్రమంలో ఒక్కోసారి గుండె పోటు వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది.
కాబట్టి, సమ్మర్‌లో కాస్త చల్లగా ఉండే ప్రదేశంలో పది నుంచి పదిహేను నిమిషాల పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి.గుండె జబ్బులతో బాధ పడే వారు వేసవిలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆల్కహాల్ జోలికి వెళ్లకూడరు.
కాఫీ, టీలను సైతం తాగడం తగ్గించాలి.

కూర్చునే ప్రదేశాల్లో తగినంత ఆక్సిజన్ ఉండేలా చూసుకోవాలి.ఇంట్లోకి చల్లటి గాలి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా కుండలో నీటిని తాగడానికే ప్రయత్నించాలి.
వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉండే కర్బూజ, పుచ్చకాయ, ఆరెంజ్, బొప్పాయి వంటి పండ్లను డైట్‌లో చేర్చుకోవాలి.ఇక హార్ట్ పేషెంట్స్ ఈ వేసవిలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.
మరీ మఖ్యంగా వెళ్లాల్సి వస్తే.నైట్ జర్నీని ఎంచుకోవడం ఉత్తమం.