ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన నాగినీడు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం చిన్నపిల్లలు కూడా ప్రవర్తన విషయంలో మారిపోయారని నాగినీడు చెప్పుకొచ్చారు.
పిల్లల సైకాలజీ తెలియకుండా తప్పులు చెయ్యకూడదని నాగినీడు అన్నారు.పెద్దలు సంపాదనలో పడి పిల్లల విషయంలో తప్పు చేస్తున్నారని ఆయన తెలిపారు.
పిల్లలు నన్ను బాపు అని పిలుస్తారని నాగినీడు అన్నారు.దేవుడు పాజిటివ్ థింకింగ్ వల్ల నేను టెన్షన్ పడకుండా చేశాడని ఆయన చెప్పుకొచ్చారు.
ఒక సినిమాకు ఫైనాన్షియర్ నుంచి సమస్య వస్తే నేను పరిష్కరించానని ఆయన కామెంట్లు చేశారు.గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో పవన్ స్టార్ హీరో అయినా సాధారణ వ్యక్తిలా సెట్ కు వచ్చారని నాగినీడు అన్నారు.
పవన్ సైలెంట్ గా ఉంటారని ఆయన పేర్కొన్నారు.
సినిమాలో నా పాత్రకు హార్ట్ ఎటాక్ వచ్చి ఆస్పత్రిలో చేర్చిన సమయంలో ఆయన లాస్ట్ లో నా చేతిని పెట్టుకుని ముద్దు పెట్టారని ఆయన అలా చేస్తే పవన్ నా కొడుకులా ప్రవర్తించాడనే భావన కలిగిందని నాగినీడు పేర్కొన్నారు.
ఇక్కడ గొప్పదనం ఎవరిదంటే పవన్ దని ఆయన చెప్పుకొచ్చారు.సినిమా రంగంలో ఒక్కరి వల్ల ఏం కాదని నాగినీడు తెలిపారు.నా యాక్టింగ్ చాలా బాగుందని చెప్పారని నాగినీడు పేర్కొన్నారు.

నేను ఉద్యోగుల విషయంలో కఠినంగా ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు.బిజినెస్ లో చేసేది హెల్ప్ అని చెప్పలేమని ఆయన కామెంట్లు చేశారు.ప్రసాద్ ల్యాబ్స్ లో ఉన్న సమయంలో నేనే రాజు నేనే మంత్రి అని ఫీలయ్యేవాడినని ఆయన కామెంట్లు చేశారు.
నాగినీడు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నాగినీడు ఈ మధ్య కాలంలో తక్కువ సంఖ్యలో సినిమాల్లో నటిస్తున్నారు.







