ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం అని చెప్పొచ్చు.ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ చాలా సింపుల్‌గా ఉంటుంది.
అయితే, కొన్ని దేశాలలో మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది.ఈ దేశాల్లో లైసెన్స్‌ను పొందేందుకు ప్రజలు టెస్టింగ్ కోసం అనేకసార్లు హాజరవుతారు.
కాగా తాజాగా, చైనాలో డ్రైవింగ్ టెస్ట్‌కు సంబంధించి ఒక క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఒక జిగ్-జాగ్ మార్గంలో ఎలాంటి తెలుపుగీతలను టచ్ చేయకుండా కారు డ్రైవ్ చేస్తేనే లైసెన్సు జారీ చేస్తామన్నట్లు చైనా రూల్స్ ఉన్నాయి.
ఒకవేళ కారు టైరు తెలుపు రంగు గీతలపైకి ఇంచు మందం ఎక్కినా సరే వెంటనే ఆ విషయాన్ని గమనించి డ్రైవింగ్ లైసెన్స్ లో ఫెయిల్ చేయడానికి అక్కడే చాలామంది నిలుచుని ఉన్నారు.వైరల్ వీడియోలో చూస్తే ఈ టెస్ట్ డ్రైవర్ డ్రైవింగ్ సామర్థ్యాలను పరీక్షించడానికి చాలా కఠినంగా రూపొందించినట్టు తెలుస్తోంది.
డ్రైవర్ పార్క్ చేయడానికి, 8 నంబర్ చేయడానికి, రివర్స్ తీయడానికి, మొదలైన కఠినమైన టర్న్స్ ఇందులో కనిపించాయి.వీడియో చివరిలో, డ్రైవర్ తన ప్యారలెల్ పార్కింగ్ స్కిల్స్ కూడా చూపించాల్సి వచ్చింది.
ఈ క్లిప్‌ను “చైనాలో డ్రైవర్ లైసెన్స్ టెస్ట్ స్టేషన్” అనే క్యాప్షన్‌తో తన్సు యెగెన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.సహజంగానే, వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.సులువుగా ఈ కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన డ్రైవర్‌ను పలువురు అభినందించారు.వామ్మో, ఈ పరీక్ష ఎంత కష్టమో అని మరికొందరు ఆశ్చర్యపోయారు.తైవాన్‌లో తమకు ఇలాంటి నియమం ఉందని మరొకరు కామెంట్ చేశారు.ఇండియాలో ఇలాంటి డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావడం చాలా మందికి అసాధ్యమని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఇప్పటికే కోటికి పైగా వ్యూ సంపాదించిన ఈ వీడియోపై మీరు కూడా లుక్కేయండి.