తెలుగు సినీ ప్రేక్షకులకు, స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా శంకర్ సుపరిచితమే.
స్టార్ హీరోలు శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేయాలి అని కోరుకుంటూ ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పాన్ ఇండియా సినిమాలు ట్రెండ్ నడుస్తోంది.
అయితే ప్రస్తుతం శంకర్ చేతిలో రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి.అందులో ఒకటి రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కాగా మరొకటి కమలహాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమా.
కాగా ఈ రెండు సినిమాల షూటింగ్ లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.అయితే మామూలుగా ఒక సినిమాను పూర్తి చేసిన తర్వాతనే మరొక సినిమాను మొదలు పెడతారు.
అలాంటిది ఒకేసారి రెండు సినిమాలను ఎందుకు చేస్తున్నారో అన్న సందేహం ప్రేక్షకులలో తలెత్తుతోంది.కాగా శంకర్ తన తదుపరి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే రూపొందించనున్నారట.
అయితే తన తదుపరి సినిమాలో ఒకరు ఇద్దరు కాదండోయ్ ఏకంగా ముగ్గులు స్టార్ హీరోలతో కలిసి పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు శంకర్.ఆ ముగ్గురు హీరోలు మరెవరో కాదు, ఒకరు సూర్య కాగా మరొకరు యష్, మూడో హీరో రణ్వీర్ సింగ్.
ఈ ముగ్గురు స్టార్ హీరోలతో కలిసి ఒక పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ శంకర్.అయితే ఈ సినిమా మూడు భాగాలుగా తెరకెక్కనుందట.తమిళంలో పేమస్ అయిన వేల్పరి అనే నవలను శంకర్ సినిమాగా తెరెక్కిస్తున్నట్లు సమాచారం.వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఈ సినిమాను అనౌన్స్ చేసి ద్వితీయార్థం నుంచి షూటింగ్ మొదలు పెడతారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఒక స్టార్ హీరోతో సినిమా అంటే ఐదారు వందల కోట్ల రూపాయలతో సినిమా చేసే శంకర్, ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలతో, అది కూడా మూడు భాగాలుగా సినిమా చేస్తారంటే మరి ఆ సినిమా ఎన్ని కోట్ల బడ్జెట్‌తో చేస్తారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.