వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.వర్ధన్నపేట మండలం డీసీ తండా వద్ద లారీని ఓ కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు.
మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు.ఒంగోలు నుంచి వరంగల్ వెళ్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం.







