ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు జంతువులను పెంచుకుంటూ ఉన్నారు.చాలామంది ప్రజలకు ఎప్పుడు జంతువులను పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టం.
అయితే కొంతమంది తమ ఇంట్ల లో కుక్కలను, పక్షులను చివరికి పాములను కూడా పెంచుకోవడం మనం చూస్తూ ఉంటాం.కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కనిపిస్తున్న యువకుడు వెరైటీగా బల్లి జాతికి చెందిన ఒక అరుదైన బల్లిని ఇంట్లో పెంచుకుంటూ ఉన్నాడు.
అందరిలాగా పిల్లలు, కుక్కలు, కుందేళ్ళు, పక్షులను పెంచుకుంటే అందులో వెరైటీ ఏముందో అనుకున్నాడో ఏమో కానీ వెరైటీగా బల్లిని ఈ యువకుడు పెంచుతున్నాడు.
బల్లిని పెంచడం అంటే చాలామంది ఇళ్లలో పెంచేలా ఏదో దాని దారిన దాన్ని వదిలేయడం కాకుండా తాను తినే తిండినే ఆ బల్లి కి కూడా ఇష్టంగా పెట్టేంత గొప్ప మనసున్న మనిషి ఈ వీడియోలో కనిపిస్తున్న యువకుడు.
ఈ బల్లి ప్రేమికుడు పెంచుకుంటున్న బల్లి కోసం ఏదో ఒక ఆహారం ఏర్పాటు చేసి తింటుందిలే అని ఊరుకునే మనిషి కాదు.ఏకంగా తన్ను తింటున్న పుచ్చకాయనే బల్లితో కలిసి తింటున్నాడు.
పుచ్చకాయ ముక్కలు ఒకవైపు తను మరోవైపు బల్లి ఇద్దరు కలిసి చూడముచ్చటగా పుచ్చకాయ ముక్కలను తినడం వీడియోలో చూస్తాం.ఆ బల్లి కూడా ఏమాత్రం భయపడకుండా వచ్చి పుచ్చకాయను తినడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోని చూసినా నేటిజెన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.కొంత మంది నెటిజెన్లు ఏమి పెంపకం అని ముక్కు మీద వేలు వేసుకుంటుండగా, మరి కొంతమంది నేటిజెన్లు కడుపులో ఏదో ఇబ్బందిగా ఉన్నట్లు ఎమోజీలు పెట్టి కామెంట్లు చేస్తున్నారు.బల్లి తో కలిసి ఆహారాన్ని తినాల్సిన అవసరం ఏముంది అని కూడా మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.







