Bear attack : ముగ్గురు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి.. వీడియో చూస్తే వణికి పోతారు..

చాలా చోట్ల ఉన్న అడవి ప్రాంతాలలో క్రూర జంతువులు తిరుగుతూ ఉంటాయి.అలాంటి అడవి ప్రాంతాలలో ఉన్న రోడ్లపై ప్రయాణిస్తున్న జనాలపైకి అలాంటి క్రూర జంతువులు దాడి చేసే వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.

 Bear Attack On Three People, Bear , Attack , People, Viral , Viral Video-TeluguStop.com

ఒక ఎలుగుబంటి ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.గాయపడిన వారి లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ భయంకరమైన సంఘటన తమిళనాడు లోనీ టెంకాశి జిల్లాలో జరిగింది.ప్రసుతం ఈ భయంకర వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.21 సెకెన్ల ఈ వీడియో లో ఎలుగుబంటి ఆ వ్యక్తిపై చేస్తున్న దాడిని చూస్తే ఎవరికైనా వణుకు పుట్టే లాగా ఉంది.

కరుథిలింగపురం గ్రామానికి చెందిన వైగుండమణి మసాలా పొట్లాలు తీసుకుని బైక్‌పై వస్తున్నాడు.

వైగుండమణి శివశైలం నుంచి పెథన్‌పిల్లై వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.అటవీ ప్రాంతాన్ని దాటుతున్న సమయంలో పక్కనే ఉన్న పొదల్లో నుంచి ఎలుగుబంటి వచ్చి ఒక్కసారిగా అతని పైకి దూకింది.

దూకిన వెంటనే అతనికి ఏమాత్రం తప్పించుకోవడానికి అవకాశం లేకుండా దాడి చేయడం మొదలుపెట్టింది.ఆ దారి గుండా ప్రయాణించేవారు, ఆ రోడ్డుకి దగ్గరలోని గ్రామ ప్రజలు అక్కడికి చేరుకుని గట్టిగా అరిచినా ఎలుగుబంటి మాత్రం అతనిపై చేస్తున్న దాడిని ఆపలేదు.

ఎంతసేపటికైనా ఆ వ్యక్తిపై ఎలుగుబంటి దాడిని ఆపకపోవడంతో దాని పైకి రాళ్ళను విసరడంతో ఆ వ్యక్తిని వదిలిపెట్టింది.కానీ మరో ఇద్దరిపై దాడి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.ఈ విషయం తెలుసుకున్న అడవి శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను హాస్పిటల్ కు తరలించారు.బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఎలుగుబంటి మాత్రం కాసేపు ఆ వ్యక్తులపై చేసిన దాడిని చూస్తే దాదాపు చంపేస్తుందేమో అనేలాగా బీభత్సం సృష్టించింది.రాళ్లు విసరంతో ఆ వ్యక్తిని వదిలిపెట్టి ఎక్కడి నుంచి వెళ్లిపోయింది.

అప్పటికే ఆ వ్యక్తి ముఖం పొట్ట భాగంలో తీవ్రంగా దాడి చేసి గాయపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube