Collector V.P Gautam : ఉనికి నీ అభినందించిన కలెక్టర్ వి.పి గౌతమ్

ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్న వాసిరెడ్డి ఉనికి ని జిల్లా కలెక్టర్ వి.పి.

 Collector V.p Gautam Who Congratulated You On Your Presence , Collector V.p Gaut-TeluguStop.com

గౌతమ్ అభినందించారు.సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో వాసిరెడ్డి ఉనికి కలెక్టర్ ను కలిసి, పెదగోపతి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ తో జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల, పెదగోపతి లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు రూ.1,05,000 లు ఆందజేసినట్లు తెలిపారు.10 సంవత్సరాలుగా తన బర్త్ డే, పండుగలకు పెద్దవారు ఇచ్చిన డబ్బును పొదుపు చేసి ఆందజేసినట్లు ఆమె తెలిపారు.ల్యాబ్ నిర్వహణ చేపట్టనున్నట్లు, ల్యాబ్ టీచర్ ను నియమించి, నెల నెలా రూ.13 వేలు వేతనం చెల్లించనున్నట్లు ఆమె అన్నారు.వాసిరెడ్డి ఉనికి నాన్న వాసిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ముదిగొండ లో ప్రిన్సిపాల్ గా, తల్లి కృష్ణవేణి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఖమ్మంలో బాటనీ లెక్చరర్ గా పనిచేయుచున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube